ఎన్నారైలకు టిక్కెట్లు... బాబు యూటర్న్ వెనక....!
ఈ క్రమంలోనే అమెరికాలో ఉంటున్న పెమ్మసానిని రావాలంటూ.. కబురు పెట్టింది. దీంతో ఆయనకూడా వచ్చేశారు
By: Tupaki Desk | 2 Feb 2024 12:30 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు మరోకీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఇప్పటి వరకు.. ఎంపీ సీట్లలో మూడు, ఎమ్మెల్యే స్థానాల్లో ఐదు స్థానాల్లో ఎన్నారైలకు అవకాశం ఇవ్వాలని భావించారు. ఈ క్రమంలో ఒకరిద్దిరికి ఇప్పటికే టికెట్లు కూడా ఖరారు చేశారు. వీరిలో గుడివాడ కీలకంగా మారింది. అయితే.. గుంటూరు నుంచి కూడా..ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్‌కు టికెట్ ఇవ్వాలని మూడు మాసాల కిందటే నిర్ణయించుకున్నారు. అప్పట్లోనే సిట్టింగ్ ఎంపీ.. గల్లా జయదేవ్ .. తాను రాజకీయాలకు దూరం అవుతున్నట్టు చెప్పారు. దీంతో పార్టీ అలెర్ట్ అయింది.
ఈ క్రమంలోనే అమెరికాలో ఉంటున్న పెమ్మసానిని రావాలంటూ.. కబురు పెట్టింది. దీంతో ఆయనకూడా వచ్చేశారు. దీనిపై తా జాగా చర్చ సాగింది. పార్టీ పొలిట్‌బ్యూరో.. ఎన్నారైలకు టికెట్లు ఇస్తే.. జరిగే పరిణామాలపై నిశితంగా చంద్రబాబుకు వెల్లడిం చింది. స్థానికంగా వైసీపీ బలమైన నాయకులను పెట్టినప్పుడు.. టీడీపీ ఎన్నారైలకు అవకాశం ఇస్తే.. సరైన సంకేతాలు ఇచ్చినట్టు కావని వెల్లడించారు. గత 2019 ఎన్నికల్లోనూ విజయవాడ వెస్ట్ సీటును ఎన్నారై.. అయిన.. ఖతూన్(మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె)కు ఇచ్చారు. అయితే.. ఆమె ఓడిపోయిన తర్వాత.. అమెరికాకు వెళ్లిపోయింది.
అంతకుముందు ప్రకాశం జిల్లా దర్శిలోనూ ఇలాగే జరిగింది. గతంలోనూ ఇలానే .. ఎన్నారైలకు టికెట్లు ఇస్తే ఇలానే చేశారంటూ పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. పైగా స్థానికంగా సమస్యలపై వారికి పట్టు ఉండదని.. అందుకే.. వారిస్థానంలో వేరే వారికి ఇవ్వాలని సూచించడంతో గుంటూరు స్థానాన్ని హోల్డ్‌లో పెట్టారు. అయితే.. పార్టీ కోసం పనిచేస్తున్న పెమ్మసానికి.. పార్టీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం పై పరిశీలించాలని పార్టీ పొలిట్ బ్యూరో భావిస్తున్నట్టు సమాచారం. బలమైన నాయకులు.. ప్రజల్లో దూసుకుపోతారని భావించిన వారికి మాత్రం ఎన్నారైలకు టికెట్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ఇక, ఇదేసమయంలో వైసీపీలో ఎవరికీ ఎన్నారైలకు టికెట్ లు ఇస్తున్న పరిస్థితి లేదని నాయకులు చెప్పారు. దీంతో టీడీపీ కనుక ఎన్నారైలకు టికెట్ ఇస్తే.. వైసీపీ వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం ఉందని కూడా నాయకులు అంచనా వేశారు. ఈ క్రమంలో చంద్రబాబు ముందు దూకుడు ప్రదర్శించినా.. తర్వాత మాత్రం ఎన్నారైల విషయంలో తప్పదు అనుకుంటే నే అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించారని సమాచారం. మొత్తానికి ఇప్పటికైతే.. ఎన్నారైల విషయాన్ని పక్కన పెట్టారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.