Begin typing your search above and press return to search.

"బాబు కుటుంబానికే సామాజిక న్యాయం"

పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్, వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే కొడాలి నాని మ‌రోసారి టీడీపీ అధినేత చంద్ర‌బా బుపై ఫైర‌య్యారు

By:  Tupaki Desk   |   6 March 2024 9:19 AM GMT
బాబు కుటుంబానికే సామాజిక న్యాయం
X

పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్, వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే కొడాలి నాని మ‌రోసారి టీడీపీ అధినేత చంద్ర‌బా బుపై ఫైర‌య్యారు. మంగ‌ళ‌గిరిలో టీడీపీ ప్ర‌క‌టించిన బీసీ డిక్ట‌రేష‌న్‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ''బాబు కుటుంబానికే సామాజిక న్యాయం జ‌రుగుతుంది. క‌మ్మ‌ల‌కే సామాజిక న్యాయం జ‌రుగుతుంది'' అని నాని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బీసీ సంఘ నాయకుడు దేవరపల్లి కోటి స‌హా 150 మంది యువకులు చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పి వైసిపిలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాని.. వారికి చ‌క్క‌ని భ‌విష్య‌త్తును అందించే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఫైర‌య్యారు. ''టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారు.

చంద్రబాబు సామాజిక వర్గం, ఆయన కోటరీకే టిడిపిలో ప్రాధాన్యత. అన్ని విభాగాల్లో బీసీలకు 50% పదవులు ఇస్తున్న ఘనత సీఎం జగన్ దే. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడు. దానికి నిదర్శనం గుడివాడ‌. లేక‌పోతే.. ఎక్క‌డ నుంచో నాయ‌కుడిని తీసుకురావ‌డం ఏంటి? ఇక్క‌డున్నోళ్లు ఏమై పోతారు? పార్టీ కోసం పని చేసే వారిని కాకుండా. 150 కోట్లకు గుడివాడ సీటును ఎన్నారైకు అమ్ముకున్నారు'' అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా అమెరికా ఎన్ఆర్ఐకి గుడివాడ ప్రజలు బుద్ధి చెబుతారని నాని వ్యాఖ్యానించారు. ఎంపీ పదవి కోసమే పురందేశ్వరి ఆరాటప‌డుతున్నార‌ని బీజేపీ ఏపీ చీఫ్‌పైనా నాని విమ‌ర్శ‌లు గుప్పించారు. జగన్ ప్రభుత్వం.. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తుందని పురుందేశ్వరి బాధపడుతున్నారని, ఆర్బీఐ నిబంధనల ప్రకారంగానే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుంద‌ని చెప్పారు. పరిమితికి మించి చేసినట్లయితే ఢిల్లీలో ఫిర్యాదు చేయొచ్చు కదా? అనిప్ర‌శ్నించారు. ఎంపీ అవ్వడానికే బిజెపిని, టీడీపీకి తాకట్టు పెట్టడానికి పురిందేశ్వరి ప్రయత్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు.