Begin typing your search above and press return to search.

పవన్ ఓపెన్ సపోర్ట్... బాబు మాటల వెనక భావమేమి...?

తాను జైలులో ఉన్నపుడు మద్దతు ఇచ్చిన వారి అందరికీ బాబు ధన్యవాదాలు తెలిపారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మాత్రం అభిననందలు తెలిపారు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 12:17 PM GMT
పవన్ ఓపెన్ సపోర్ట్... బాబు మాటల వెనక భావమేమి...?
X

రాజకీయాల్లో అపర చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన జనంలో స్పీచ్ ఇచ్చినపుడు కూడా స్పీడ్ గా మాట్లాడినా అందులో తూకం ఎక్కడా దెబ్బతినదు, అన్నీ చూసుకునే మాట్లాడుతారు. అలాంటి బాబు కోర్టు ఆంక్షల నేపధ్యంలో జైలు నుంచి బయటకు రాగానే మీడియాకు ఇచ్చిన చిన్నపాటి స్పీచ్ లో బోలెడు అర్ధాలు పరమార్ధాలు ఉన్నాయని అంటున్నారు.

తాను జైలులో ఉన్నపుడు మద్దతు ఇచ్చిన వారి అందరికీ బాబు ధన్యవాదాలు తెలిపారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మాత్రం అభిననందలు తెలిపారు. ఇది ఒక కీలకమైన తేడాగా చూడాలని అంటున్నారు. ఇక పవన్ గురించి చెబుతూ ఓపెన్ గా సపోర్ట్ చేశారు అన్న మాటను బాబు వాడారు.

దీని భావమేని బాబు గారూ అనే ఇపుడు అంతా అంటున్నారు. సపోర్ట్ చేసారు పవన్ అని చెబుతూ ఓపెన్ గా అనడంలోనే చాలా కధ ఉందని అంటున్నారు. ఓపెన్ గా సపోర్ట్ అంటే టీడీపీ లాంటి ఒక పార్టీకి మరో పార్టీ అధినాయకత్వం మద్దతు ఇవ్వడం అంటే అది రాజకీయ సాహసంగానే చూడాలి.

విషయం తెలిసిన వారు అంతా అలాగే చూస్తున్నారు. అయితే చంద్రబాబు ఓపెన్ గా మద్దతు అనడంత్లో అర్ధాలు చూసుకుంటే పూర్తిగా మద్దతు అని అనుకోవచ్చా అన్న చర్చ సాగుతోంది. డేరింగ్ అండ్ డేషింగ్ గా కూడా సపోర్ట్ చేశారని కూడా భావించవచ్చా అని మరో ప్రశ్న కూడా వస్తోంది.

ఒక పాటీ అధినాయకత్వం తమ ప్రయోజనాలకే తొలి ప్రయారిటీ ఇస్తుంది. అలా కాకుండా వేరే పార్టీకి మద్దతు ఇస్తోంది అంటే అందులో సాధక బాధకాలను కూడా చూడకుండా గట్టిగా నిలబడినట్లుగా కూడా ఓపెన్ సపోర్ట్ ని అర్ధం చేసుకోవాలని అంటున్నారు. అంటే రేపటి రోజున టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన పూర్తి మద్దతుతో ముందుకు వచ్చిందనేనా అసలు సిసలు అర్ధం అని కూడా ఆలోచిస్తున్న వారు ఉన్నారు.

ఇక చంద్రబాబు చూస్తే పవన్ కి అభినందనలు తెలియారు. అభిననందనలు చెప్పడం అంటే టీడీపీ విజయం ఖాయం అయిందనా అలాంటి నేపధ్యంలో మద్దతు గా నిలిచి తానూ భాగస్వామిగా పవన్ మారారని అనా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మొత్తానికి చూస్తే చంద్రబాబు 53 రోజులు జైలులో ఉండవచ్చు కానీ ఆయనకు ఏపీలో జరుగుతున్న ప్రతీ పరిణామమూ క్షుణ్ణంగా తెలుసు అనే అంటున్నారు. అందుకే చంద్రబాబు తమ విజయానికి అంతా సహకరిస్తున్నారని ధన్యవాదాలతో పాటు పవన్ లాంటి మరింత దగ్గర మిత్రుడుకి అభినందనలు తెలియచేశారు అని అంటున్నారు.

దానికి ముందు పవన్ చేసిన ట్వీట్ కూడా ఉంది. బాబు లాంటి వారి అనుభవం రాష్ట్రానికి అవసరం అని. దానిని పరిగణనలోకి తీసుకునే బాబు అభినందనలు చెప్పారని అంటున్నారు. అంటే బాబు అనుభవానికి అసలైన అర్ధం ఆయన ముఖ్యమంత్రి కావడమే. ఆ విధంగా పవన్ ప్రకటించడమే ఓపేన్ సపోర్ట్ అని కూడా అంటున్నారు.

నిజానికి పవన్ బాబు జైలు నుంచి బెయిల్ మీద రావడాన్ని ఆహ్వానిస్తూ ఇది శుభ పరిణామం అని అక్కడితో ఆపేయవచ్చు. కానీ బాబు గురించి ఎన్నో విశేషణాలను ఆయన తగిలించి మీ సేవలు అవసరం, మీరు ప్రజా సేవలో పునరంకితం కావాలని ట్వీట్ చేసారు. దాంతోనే బాబు రిప్లైని కూడా సరిపోల్చుకుంటున్నారు అని అంటున్నారు.

ఒక పార్టీ అధినేత వేరొక పార్టీ అధినేత అనుభవాన్ని ఆయన సేవలు అవసరాన్ని నొక్కి వక్కాణిస్తూంటే కచ్చితంగా ఎవరైనా అభినందిస్తారు. బాబు కూడా అదే పని చేశారు అని అంటున్నారు. సో టీడీపీకి జనసేనతో పొత్తు ఉన్నా రూట్ క్లియర్ అయిందని ఆ పార్టీ శ్రేణులు బాబు మాటలను బట్టి అర్ధం చేసుకుంటున్నాయా అన్నది ఇక్కడ కీలకమైన అంశం. అదే విధంగా పవన్ ట్వీట్ మీద కూడా చర్చ అటూ ఇటూ సాగుతోంది. చూడాలి మరి దీని ఫలితాలు రేపటి రెండు పార్టీల యాక్షన్ లో ఏ మేరకు కనిపిస్తాయో అన్నది విశ్లేషకుల మాట.