Begin typing your search above and press return to search.

40 ఏళ్ళలో మొదటిసారి

స్కిల్ డెవలప్మెంట్ సెంబర్ కుంభకోణంలో 40 ఏళ్ళ రాజకీయజీవితంలో మొదటిసారి చంద్రబాబునాయుడు అరెస్టయ్యారు

By:  Tupaki Desk   |   9 Sep 2023 5:40 AM GMT
40 ఏళ్ళలో మొదటిసారి
X

స్కిల్ డెవలప్మెంట్ సెంబర్ కుంభకోణంలో 40 ఏళ్ళ రాజకీయజీవితంలో మొదటిసారి చంద్రబాబునాయుడు అరెస్టయ్యారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును ఆయన బసచేసిన ఫంక్షన్ హాలులోనే సీఐడీ అధికారులు అరెస్టుచేశారు. రు. 3300 కోట్ల కుంభకోణంలో రు. 371 కోట్లు చేతులు మారినట్లు సీఐడీ నిర్ధారించింది. ఇందులో కూడా రు. 241 కోట్లను షెల్ కంపెనీలకు తరలించినట్లు సీఐడీ ఆరోపించింది. ఈ మొత్తంలో చంద్రబాబే కీలకసూత్రదారుగా సీఐడీ చెప్పింది.

మరి తమ దర్యాప్తులో చంద్రబాబే కీలక సూత్రదారుగా సీఐడీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో తెలీదు. తన అరెస్టుకు సంబంధించి ఆధారాలను చూపించమని చంద్రబాబు పడేపదే డిమాండ్ చేశారు. అయితే కుంభకోణానికి సంబంధించిన అన్నీ ఆధారాలను తాము ఇప్పటికే కోర్టుకు అందించామని సీఐడీ స్పష్టంచేసింది. విజయవాడకు తరలించిన తర్వాత అన్నీ వివరాలు తెలుస్తాయని సీఐడీ బదులిచ్చింది.

సరే ఆధారాలున్నాయా ? లేవా ? అన్నది కోర్టులోనే తేలుతుంది. వీవీఐపీని అరెస్టుచేసేముందు సీఐడీ అధికారులు ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అన్నది తర్వాత తేలుతుంది. తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసినట్లు చంద్రబాబు మండిపోయారు. తనను అరెస్టుచేసినందుకు అవసరమైన ఆధారాలున్నాయా అని అడిగినపుడు సీఐడీ అధికారులు ఏమీ చెప్పలేదని చంద్రబాబు అన్నారు. ఇలాంటి కేసులు, అరెస్టులన్నీ రాజకీయంగా సంచలనం అవటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఇలాంటి కేసులు కోర్టు విచారణలో నిలుస్తాయా లేదా అన్నది కాలమే సమాధానం చెబుతుంది.

40 ఏళ్ళ రాజకీయజీవితంలో చంద్రబాబుపై ప్రభుత్వాలు చాలా కేసులు పెట్టాయి. విచారణలు చేయించాయి. అయితే ఏ కేసులో కూడా చంద్రబాబును అరెస్టు చేయటానికి అవసరమైన ఆధారాలు దొరకలేదు. చివరకు విచారణ కమిటీలు వేసినా ఏమి సాధించలేకపోయాయి. దాంతో కమిటీలను, కేసులను ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయి. అలాంటిది ఇపుడు సడెన్ గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కుంభకోణం అని సీఐడీ చంద్రబాబును అరెస్టుచేసింది. ఇప్పటికే ఇదే కుంభకోణంలో 28 మందిని నిందితులుగా సీఐడీ చేర్చింది. ఎనిమిది మందిని అరెస్టుకూడా చేసింది. ఇపుడు చంద్రబాబు అరెస్టు జరిగింది. ఇదే కేసులో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కొడుకును కూడా సీఐడీ అరెస్టు చేయటం ఇంట్రెస్టింగుగా మారింది.