అతి ధీమా బాబుని జైలు పాలు చేసిందా...?
యంటిసిపేటరీ బెయిల్ కి బాబు పిటిషన్ వేసి ఉంటే అరెస్ట్ అయినా ఆయన బయటనే ఉండేవారు అని అంటున్నారు
By: Tupaki Desk | 14 Sep 2023 12:30 PM GMTఅతి ధీమా ఒక్కోసారి భరించలేని మూల్యం కోరుతుంది. బహుశా అలాంటి చేదు అనుభవమే ఇపుడు చంద్రబాబు అనుభవిస్తున్నారు వాలి అంటున్నారు. చంద్రబాబు టీడీపీ నాలుగున్నరేళ్ళుగా విపక్షంలో ఉంది. వైసీపీ ఎంతో మంది మీద కేసులు పెట్టింది. అరెస్టులు చేసింది. అయితే కొంతమంది నాయకులు అయితే జైలుకు వెళ్లకుండానే ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగారు.
వారి వెనక ఉంటూ అండదండలు అన్నీ అందించింది చంద్రబాబు. మరి అలాంటి చంద్రబాబుకే కష్టం వస్తే ఆయన సులువుగా ఒడ్డెక్కలేరా అన్నది టీడీపీ లోపలా బయటా అందరిలోనూ ఒక గట్టి నిబ్బరంగా ఉండేది. కానీ బాబు విషయంలో ఆ ధీమాయే కొంప ముంచింది అని అంటున్నారు. లేకపోతే తనను అరెస్ట్ చేస్తారు అని గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కి ఎందుకు ప్రయత్నం చేయలేదు అన్నదే ఇపుడు కీలకమైన ప్రశ్నగా ముందుకు వస్తోంది.
యంటిసిపేటరీ బెయిల్ కి బాబు పిటిషన్ వేసి ఉంటే అరెస్ట్ అయినా ఆయన బయటనే ఉండేవారు అని అంటున్నారు. ఇక బాబు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉంటే వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయకుండా హై కోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం కూడా లీగల్ గా రాంగ్ రూట్ లో వెళ్లారా అన్న చర్చకు తెర లేస్తోంది.
దీనికి ముందు కూడా బాబు అరెస్ట్ అయితే బెయిల్ అడాగాల్సిన నేపధ్యంలో హౌస్ కస్టడీ పిటిషన్ ని మూవ్ చేశారు. అలా కూడా టైం అంతా పోయింది అని అంటున్నారు. ఒకసారి ఒక కేసులో రిమాండ్ ఇచ్చాక బెయిల్ కే ఎవరైనా వెళ్తారు అని న్యాయ నిపుణులు అంటున్నారు. కానీ క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారో అని ఇపుడు చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది.
ఇక క్వాష్ పిటిషన్ తో సహా బాబు తరఫున న్యాయవాదులు వేసిన అనేక పిటిషన్ల మీద విచారణను హై కోర్టు ఈ నెల 19 నాటికి కోర్టు వాయిదా వేసింది. దాంతో చంద్రబాబు మరిన్ని రోజులు జైలులో గడపాల్సి వస్తోంది అని అంటున్నారు. ఇక క్వాష్ పెటిషన్ హై కోర్టులో వేసిన తరువాత లేటెస్ట్ గా ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ కి బాబు న్యాయవాదులు పిటిషన్ వేశారు.
ఇది రేపు విచారణకు రావచ్చు అని అంటున్నారు. అయితే క్వాష్ పిటిషన్ హై కోర్టులో వేసి బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయవచ్చా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. దీని మీద ప్రభుత్వం తరఫున న్యాయవాదుల్ ఏ పాయింట్ లేవనెత్తుతారో తెలియదు కానీ మొత్తానికి న్యాయపరమైన అంశాలలో ఆరితేరిన చంద్రబాబు తనదాకా వచ్చేసరికి తప్పే చేశారా అన్న చర్చ అయితే నడుస్తోంది.
నిజానికి చూస్తే చంద్రబాబుకు లీగల్ ఇష్యూస్ లో మంచి పట్టు ఉంది అని అంటారు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీని తన సొంతం అని ఆయన ప్రకటించుకోవడమే కాదు న్యాయపరంగా దాన్ని సాధించుకున్నారు. అలాగే తన మీద వచ్చిన ఎన్నో కేసుల విషయంలో కూడా ఆయన పలు మార్లు స్టేలు తెచ్చుకున్నారు. అలాంటి బాబు ఇపుడు ఒక కేసులో రిమాండ్ ఖైదీగా ఉండడం అంటే తమ్ముళ్లే విస్తుబోయే పరిస్థీతి అని అంటున్నారు.
అయితే సింపతీ కార్డు కోసమే ఇలా చేస్తున్నారు అని కొంతమంది అంటున్నా అలా అయితే బెయిల్ పిటిషన్లు ఎందుకు వేస్తారు అని మరో ప్రశ్న కూడా ఉంది. మొత్తానికి సరైన మార్గంలో ఆలోచించకుండా రాంగ్ రూట్ లో వెళ్లడం వల్లనే బాబు జైలులో మరిన్ని రోజులు ఉండాల్సి వస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి బాబు వీలైనంత తొందరగా బెయిల్ మీద బయటకు ఎలా వస్తారు అన్నది అంటున్నారు.