Begin typing your search above and press return to search.

అధికారంలోకి వస్తే కొత్త బాబునే చూస్తారా ?

మొత్తానికి ఈసారి టీడీపీ క్యాబినెట్ లో కొత్త ముఖాలకే చాన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 May 2024 3:45 AM GMT
అధికారంలోకి వస్తే కొత్త బాబునే చూస్తారా ?
X

టీడీపీ అధినేత బాబు తన రాజకీయ జీవితంలో తల పండిన వారే. కానీ ఆయన 2019 నుంచి 2024 మధ్య అయిదేళ్ల కాలంలో నేర్చుకున్నంతగా తన మొత్తం పొలిటికల్ లైఫ్ లో నేర్చుకోలేదు అని అంటూంటారు. అది స్వపక్షం విషయంలో కానీ అలాగే అధికార పక్షం వైపు నుంచి వచ్చే దాడులు గురించి కానీ ఆయన నెవర్ బిఫోర్ అన్నంతగా అనుభవాలను అందుకున్నారు అని అంటున్నారు.

ఒక్కసారి అధికారం చేజారితే అంతకు ముందు అయిదేళ్ళ పాటు పదవులు రుచి చూసి ఆసాంతం అనుభవించిన వారు సైతం ఎలా తెర చాటుకు పోతారో బాబు స్వయంగా చూశారు. 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చి మొదటి మూడేళ్ళూ దూకుడు చేస్తే బడా నాయకుల నుంచి సీనియర్లు అత్యధిక శాతం బయటకు రాని నేపధ్యాన్ని ఆయన చూసారు అని అంటున్నారు.

ఇలా సొంత పార్టీ వారు చేదు నిజాలు చెబితే అధికారం చేతిలో ఉంచుకుని విపక్షాన్ని ఎంతలా కట్టడి చేయగలరో అది హద్దులు ఎంతలా మీరుతుందో కూడా బాబు కళ్ళారా చూసారు. రాజకీయాన్ని రాజకీయంగానే బాబు ఇప్పటిదాకా చేస్తూ వచ్చారు. కానీ 2019 నుంచి ఆయన చూసిన రాజకీయమే వేరు అని అంటున్నారు.

అందుకే ఆ అనుభవాల సారం నుంచి ఆయన ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు అని అంటున్నారు. దాంతో ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే కొత్త బాబునే చూస్తారు అని అంటున్నారు. గతంలో చాలా సార్లు ఈ మాట అన్నా ఈసారి ఆయన అది నిజం చేస్తారు అని అంటున్నారు. నిజానికి చంద్రబాబు ఎన్నికల సమయంలోనే చాలా మందికి టికెట్లు నిరాకరించాలని చూసారు. చివరి నిముషంలో వచ్చిన ఒత్తిళ్ళు గెలుపు అనివార్యం కావడం చేత కొంత రాజీ పడ్డారు అని అంటారు.

అయితే అధికారం చేతిలోకి వచ్చాక మాత్రం ఆయన తనదైన శైలిలోనే నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. దానికి నాందిగా ఆయన మార్క్ మంత్రివర్గం కూర్పుతోనే మొదలవుతుంది అని అంటున్నారు. ఈసారి చంద్రబాబు మంత్రులలో అత్యధిక శాతం యువత కొత్త వారు ఉంటారు అని అంటున్నారు. ఆయా జిల్లాల నుంచి ఎన్నడూ పదవులు దక్కించుకోని వారు ఫ్రెష్ లుక్ ఉన్న వారికే ఇస్తారు అని అంటున్నారు.

సీనియర్లు అనేక సార్లు మంత్రులుగా అయిన వారికి మాత్రం పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే మంత్రి పదవులను మరోసారి అనుభవించాలని ఉవ్విళ్ళూరుతున్న బడా నాయకులకు మాత్రం బాబు మార్క్ షాక్ తప్పదని అంటున్నారు. పార్టీ పటిష్టతతో పాటు మరింత కాలం టీడీపీ మనుగడ సాగించేలా బాబు నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు.

అలాగే ఆయన సామాజిక సమీకరణలను కూడా సరిచూసుకుంటూ వినూత్న నిర్ణయాలకు ఆస్కారం ఇస్తారని అంటున్నారు. ఇక చంద్రబాబు సైతం దూకుడు రాజకీయానికి తెర తీస్తారని ఏపీలో గతంలో ఎన్నడూ చూడని విధంగా బాబు పాలన సాగే అవకాశం ఉంటుందని అంటునారు. మొత్తం మీద చూస్తే బాబు మంత్రి వర్గం లో చేరాలని చాలా మంది ఆశలు పెట్టుకుని ఉండవచ్చు.

కానీ ఆయన మాత్రం చాలా దూర దృష్టితో కొత్త ఆలోచనలతోనే ముందుకు పోతారు అని అంటున్నారు. టికెట్ల జారీలోనే బాబు ఆలోచనలు ఏమిటి అన్నది కొంత వెలుగులోకి వచ్చింది. సీనియర్లు అనుకున్న వారిని చివరి వరకూ టెన్షన్ లో పెట్టడం ద్వారా తానేంటో చెప్పిన బాబు అధికారం దక్కాక తనదైన శైలిని కూడా అమలులోకి పెడతారు అని అంటున్నారు. మొత్తానికి ఈసారి టీడీపీ క్యాబినెట్ లో కొత్త ముఖాలకే చాన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.