Begin typing your search above and press return to search.

ఏపీలో ఘర్షణ వాతావరణం... కాబోయే సీఎం రియాక్షన్ ఇదే!

ఇందులో భాగంగా... మాజీమంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 2:01 PM GMT
ఏపీలో ఘర్షణ వాతావరణం... కాబోయే సీఎం రియాక్షన్ ఇదే!
X

ఏపీలో ప్రధానంగా ఈ రోజు పలు అవాంఛనీయ ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ పలు ఘర్షణలు జరుగుతున్న నేపథ్యలో.. శుక్రవారం వైసీపీ కీలక నేతల ఇళ్లపై దాడులు జరిగిన పరిస్థితి. ఇందులో భాగంగా... మాజీమంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు.

ఇందులో భాగంగా... కొడాలి నాని ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్న తెలుగు యువత నేతలు కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని.. రాజకీయాలనుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అవకులూ చెవాకులూ పేలిన కొడాలి నాని.. ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నిస్తూ.. తమకు సమాధానం చెప్పాలని అన్నారు.

ఇదే క్రమంలో... మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా దాడికి ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు వంశీ నివాసం ఉండే అపార్ట్మెంట్ ను నాలుగు వైపులా చుట్టు ముట్టి.. వాహనాల్లో తిరుగుతూ హల్ చల్ చేశారు. ఇదే సమయంలో వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు వేశారని అంటున్నారు. ఈ సమయలో పోలీసులు రంగప్రవేశం చేసి శ్రేణుల్ని చెదరగొట్టారు.

ఇదే సమయంలో... రాజమండ్రిలోనూ వైసీపీ నేత మార్గాని భరత్ ఎంపీగా ఉన్న సమయంలో వేసిన శిలాపలకాన్ని ధ్వంసం చేశారు. ఇలా ఏపీలో వరుసగా పలు ఘర్షణలు జరిగిన పరిస్థితి. ఈ సమయంలో టీడీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.

అవును... ఏపీలో పలు ఘర్షణపూరిత ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలెర్ట్ గా ఉండి.... ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని చంద్రబాబు కోరారు.

ఇదే క్రమంలో... వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలి. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని చంద్రబాబు ఆన్ లైన్ వేదికగా ఆదేశాలు జారీ చేశారు.