Begin typing your search above and press return to search.

తొలిసారి కార్యాల‌యానికి.. చంద్ర‌బాబుకు ఊహించ‌ని స్వాగ‌తం!

ఇక‌, ఊహించ‌ని ప‌రిణామం ఏంటంటే.. పోలీసులు ఆయ‌న‌కు గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించడం. వాస్త‌వానికి ఇప్పుడు ఎన్నిక‌ల కోడ్ ఉంది

By:  Tupaki Desk   |   3 Jun 2024 1:45 PM GMT
తొలిసారి కార్యాల‌యానికి.. చంద్ర‌బాబుకు ఊహించ‌ని స్వాగ‌తం!
X

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చారు. గ‌త నెల 13న జ‌రిగిన‌ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన త‌ర్వాత‌.. ఆయ‌న తొలిసారి సోమ‌వారం కార్యాల‌యానికి వ‌చ్చారు. ఈ నేప‌థ్యం లో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా.. పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఊహించ‌ని విధంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ ఊహించ‌ని స్వాగ‌తంలో చంద్ర‌బాబు ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు.

ఇక‌, ఊహించ‌ని ప‌రిణామం ఏంటంటే.. పోలీసులు ఆయ‌న‌కు గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించడం. వాస్త‌వానికి ఇప్పుడు ఎన్నిక‌ల కోడ్ ఉంది. దీంతో వారు ఇలా చేయొచ్చా.. అనేది సందేహం. అయితే.. మారుతున్న ట్రెండ్ ను బ‌ట్టి వారు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారా? అనేది చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రోవైపు.. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌న్నీ కూడా టీడీపీ కూట‌మికే మొగ్గు చూపుతున్నాయి. దీంతో పోలీసులు టీడీపీ అధినేత కు సెల్యూట్ చేశార‌ని అంటున్నారు.

ఇక‌, తాజా ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఒక‌టికి రెండు సార్లు పార్టీ కార్య‌క‌ర్త‌లు , నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. వాటిని చ‌ర్చించారు. ఇక‌, మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న కౌంటింగ్‌పైనా ఆయ‌న సుదీర్ఘ చ‌ర్చ‌లు చేప‌ట్టారు. అయితే.. పార్టీ కార్యాల‌యానికి రావ‌డం ద్వారాచంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌కు , శ్రేణుల‌కు కూడా.. బ‌ల‌మైన సంకేతాలు ఇచ్చార‌ని అంటున్నారు.

ఇక‌, త‌మ పార్టీ గెలుస్తుంద‌ని.. సంబ‌రాల‌కు సిద్ధంగా ఉండాల‌ని ఓవైపు.. వైసీపీ నాయ‌కుడు, స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏకంగా పార్టీ కార్యాల‌యానికి రావ‌డం మ‌రింత గా పార్టీలో జోష్ నిపింద‌ని అంటున్నారు సీనియ‌ర్‌నాయ‌కులు. మ‌రిఫ‌లితం ఎలా ఉంటుందో మంగ‌ళ‌వారం ఉద‌యం 10-11 గంట‌ల మ‌ధ్యే తేలిపోతుంద‌ని అంటున్నారు. చూడాలిమ‌రి ఏం జ‌రుగుతుందో!!