Begin typing your search above and press return to search.

చంద్రబాబు కొత్త కాన్వాయ్ సిద్ధం... ప్రత్యేకతలివే!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   10 Jun 2024 8:06 AM GMT
చంద్రబాబు కొత్త కాన్వాయ్ సిద్ధం... ప్రత్యేకతలివే!
X

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రజలు చంద్రబాబు & కో కి క్లీన్ మెజారిటీ ఇచ్చారు. బాబుపై వారు పెట్టుకున్న నమ్మకాన్ని సుస్పష్టంగా ఓటుతో వ్యక్తపరిచారు. ఏపీని తిరిగి గాడిలో పెట్టాల్సిన బాధ్యతను అప్పగించారు. దీంతో... టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

అవును... ఏపీకి పునరుజ్జీవం వచ్చిందనే మాటలు జూన్ 4 నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో జూన్ 12 - బుధవారం చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుకకోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీపార్కు వేదిక కానుంది.

ఈ వేడుక కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న "తెలుగు"వారు అసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు.

ఈ సమయంలో ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లలో కీలక భాగాన్ని పూర్తి చేసింది. ఇందులో భాగంగా చంద్రబాబు కోసం ఇంటెలిజెన్స్ వింగ్ 11 ఫార్చ్యూనర్ కార్లను సిద్ధం చేసిందని తెలుస్తుంది. ఈ కార్లన్నింటికీ రిజిస్ట్రేషన్ నెంబర్ “393” కాగా, ఆ వాహనాల రంగు నలుపు! కాగా.. చంద్రబాబుకు ఇప్పటికే జెడ్+ కేటగిరీ భద్రత ఉన్న సంగతి తెలిసిందే.