Begin typing your search above and press return to search.

లోకేష్ కి చంద్రబాబు కొత్త డైరెక్షన్ !

టీడీపీ అధినేత నారా చంద్రబాబు రాజమండ్రి జైలులో గత ఇరవై రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 5:08 PM GMT
లోకేష్ కి చంద్రబాబు కొత్త డైరెక్షన్ !
X

టీడీపీ అధినేత నారా చంద్రబాబు రాజమండ్రి జైలులో గత ఇరవై రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఇక తండ్రిని జైలులో రెండు సార్లు ములాఖత్ లో కలసిన నారా లోకేష్ సెప్టెంబర్ 14న ఢిల్లీకి బయల్దేరివెళ్ళారు. ఆయన గత ఇరవై రోజులుగా ఢిల్లీలో ఉంటూ వస్తున్నారు. చిత్రంగా జగన్ ఢిల్లీ వెళ్ళిన సమయంలోనే లోకేష్ తిరుగు ప్రయాణంలో ఏపీకి వచ్చారు. జగన్ రెండు రోజులు ఢిల్లీలో గడపబోతున్నారు.

ఇక్కడ ఏపీలో నారా లోకేష్ కూడా కొన్ని రోజులు ఉంటారని తెలుస్తోంది. శుక్రవారం లోకేష్ తన కుటుంబ సభ్యులతో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. ఈ సందర్భంగా తండ్రీ కొడుకులు చాలా విషయాలు ముచ్చటించుకుంటారని తెలుస్తోంది.

చంద్రబాబు లోకేష్ కి కొత్త డైరెక్షన్ ఇస్తారని అంటున్నారు. ఈ నెల 9న చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టులో రానుంది. అక్కడ కనుక చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభిస్తే ఇక ఎదురు ఉండదు. నేరుగా జైలు నుంచి బయటకు వస్తారు. లేకపోతే మాత్రం ఆయన బెయిల్ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. బెయిల్ పిటిషన్ మీద ఏ విధంగా సీఐడీ రియాక్ట్ అవుతుంది అన్నది కూడా చూడాలి.

ఏది ఏమైనా చంద్రబాబు క్వాష్ పిటిషన్ వ్యవహారం తేలితే బెయిల్ పిటిషన్ నుందుకు వస్తుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే నారా లోకేష్ నుంచి ఏపీ రాజకీయ పరిస్థితులను చంద్రబాబు పూర్తి స్థాయిలో తెలుసుకుంటారని అంటున్నారు. అదే విధంగా జనసేనతో పొత్తు ఆ పార్టీ అధినేత పవన్ వారాహీ టూర్ ఆయన చేస్తున్న ప్రకటనలు ఇవన్నీ కూడా చర్చకు వస్తాయని అంటున్నారు.

లోకేష్ ఇక మీదట ఏపీలో ఉంటే ఎలా టీడీపీలో దూకుడు పెంచాలి ఏమేమి చేయాలి అన్న దాని మీద చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నరు. ఒక విధంగా టీడీపీకి భావి వారసుడిగా లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడంలో ఈ అరెస్ట్ పెద్దగా ఉపయోగపడలేదు అనే అంటున్నారు. ఢిల్లీలో అన్నేసి రోజులు గడిపి లోకేష్ బిగ్ చాన్స్ మిస్ చేసుకున్నారని అంటున్నారు.

చంద్రబాబుకు తెలిసే లోకేష్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అయితే అన్ని రోజులు ఆయన అక్కడ ఉండడం మాత్రం సొంత నిర్ణయమా లేక పార్టీ వ్యూహమా అన్నది తెలియడంలేదు. ఇక చాలా రోజుల తరువాత ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన లోకేష్ కి విమానాశ్రయంలో పార్టీ జనాలు ఘన స్వాగతం పలికారు.

లోకేష్ కి ఉన్న క్రేజ్ బాబు అరెస్ట్ తరువాత పార్టీలో పెరిగిన కసి ఇవన్నీ లోకేష్ కి ఘన స్వాగతంలో కనిపించాయని అంటున్నారు. ఒక విధంగా టీడీపీ క్యాడర్ అయితే ఎక్కడా నిబ్బరం కోల్పోలేదు అనే అంటున్నారు. ఇక ములాఖత్ తరువాత టీడీపీ రాజకీయం మలుపు తిప్పేలా లోకేష్ రోల్ ఉండబోతోంది అని అంటున్నారు. చూదలి మరి ఏమి జరుగుతుందో.