Begin typing your search above and press return to search.

గోడమీద బల్లి, నేలమీద బొద్దింక... బాబుకు కొత్త ఇబ్బందులు!?

గోడమీద బల్లులు, నేలమీద బొద్దింకలు చంద్రబాబుకు అసౌకర్యాన్ని కుడా కలిగిస్తున్నాయంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   19 Sep 2023 5:25 AM GMT
గోడమీద బల్లి, నేలమీద బొద్దింక... బాబుకు కొత్త ఇబ్బందులు!?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల నడుమ రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఈ సమయంలో తన గదిలో ఇబ్బందులు ఉన్నాయంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అవును... రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన గదిలో బాబు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు ఇంటి భోజనం, అవసరమైన మందులతో పాటు స్నానానికి వేడి నీటిని కూడా అందిస్తున్నారు. టైం పాస్ అవ్వడం కోసం ఐదు న్యూస్ పేపర్లు, టీవీ కూడా ఏర్పాటు చేశారని చెబుతున్నారు.

అయితే ఆయన గదిలో బొద్దింకలు, బల్లులు ఉన్నాయని.. వాటివల్ల బాబు ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తుతాయని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గోడమీద బల్లులు, నేలమీద బొద్దింకలు చంద్రబాబుకు అసౌకర్యాన్ని కుడా కలిగిస్తున్నాయంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది.

ఆ సంగతి అలా ఉంటే... చంద్రబాబు14 రోజుల రిమాండ్ లో ఇప్పుడు పదో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో సోమవారం చంద్రబాబు కుటుంబ సభ్యులను ములాఖత్ లో కలిశారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబుని కలిసి చర్చించారు!

అనంతరం మీడియాతో మాట్లాడిన యనమల... తనకు గదిలో ఏసీ లేదని, ఇబ్బందిగా ఉందని బాబు తనతో చెప్పాడని తెలిపారు. అయితే... కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు.