Begin typing your search above and press return to search.

నివేదిక‌ల‌పైనే నామినేటెడ్ పోస్టులు ..!

తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకోసం క‌ష్ట‌ప‌డిన నాయ‌కులు ఎవ‌రు.. ? కేవ‌లం షో చేసి.. చేతులు దులుపుకొన్న నాయ‌కులు ఎవ‌రు? అనే విష‌యాల‌పై చంద్ర‌బాబు కూపీలాగుతున్నారు.

By:  Tupaki Desk   |   7 July 2024 3:46 AM GMT
నివేదిక‌ల‌పైనే నామినేటెడ్ పోస్టులు ..!
X

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీకి సంబంధించి.. చంద్ర‌బాబు ముందు పెద్ద స‌వాలే ఏర్ప‌డింది. పార్టీ కోసం.. ప‌నిచేసిన‌వారు, సీట్లు త్యాగం చేసి ప‌ద‌వులు పోగొట్టుకున్న‌వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీరిని సంతృప్తి ప‌ర‌చాల్సి ఉంది. వీరంతా కూడా.. సుమారు 250కిపైగా ఉన్న నామినేటెడ్ పోస్టుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. కూట‌మిలో మూడు పార్టీలు ఉండ‌డంతో వీటిని కూడా ఆయా పార్టీల‌కు ఇవ్వాల్సి ఉంటుంది. సుమారు 50 వ‌ర‌కు జ‌న‌సేన‌కు,.,. మ‌రో 10 వ‌ర‌కు బీజేపీకి ఇచ్చే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

పోగా.. మిగిలిన 190 లేదా 200 పోస్టుల‌ను టీడీపీ భ‌ర్తీ చేయాల్సి ఉంటుంది. వీటి కోసం నాయ‌కులు వేచి చూస్తున్నారు. చంద్ర‌బాబు నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌నే విష‌యంపై వారు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు పార్టీ అధినేత‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏం చేస్తార‌నేది పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. అయితే.. ఈ విష‌యంపై ఇప్ప‌టికే చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. క్షేత్ర‌స్థాయిలో ఉన్న అవ‌కాశాలు.. లైన్‌లోఉన్న నాయ‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని.. ఎంపిక ప్ర‌క్రియపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకోసం క‌ష్ట‌ప‌డిన నాయ‌కులు ఎవ‌రు.. ? కేవ‌లం షో చేసి.. చేతులు దులుపుకొన్న నాయ‌కులు ఎవ‌రు? అనే విష‌యాల‌పై చంద్ర‌బాబు కూపీలాగుతున్నారు. అ యితే.. ఇదేమీ కేవ‌లం తూతూ మంత్రంగా కాకుండా.. బ‌ల‌మైన కేడ‌ర్ నుంచే తీసుకుంటున్నారు. ఆన్ లైన్ లో మొబైల్ అప్లికేష‌న్ల‌ను పార్టీ కీల‌క కార్య‌క‌ర్త‌లుగా ఉన్న 35 ల‌క్ష‌ల మందికి టీడీపీ కేంద్ర కార్యాల యం నుంచి పంపిస్తున్నారు. వీటిలో ప‌నిచేసిన నాయ‌కుల పేర్లను ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఇలా.. కార్య‌క‌ర్త‌లు.. స‌ర్టిఫై చేసిన వారికి మాత్ర‌మే నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యిం చిన‌ట్టు కీల‌క నాయ‌కులు చెబుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కేడ‌ర్ స‌హా.. ప్ర‌జ‌ల నుంచి స‌మాచా రం సేక‌రించిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇక‌, పార్టీ ప‌ద‌వుల విష‌యంలోనూ ఇదే పంథా పాటించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్టు చెబుతున్నారు. అంటే.. కేడ‌ర్‌ను విస్మ‌రించి.. ప‌దువులు చేప‌ట్టాల‌ని అనుకున్న వారికి చంద్ర‌బాబు పద‌వుల ద్వారా చెక్ పెడుతున్నార‌న్న చ‌ర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.