చంద్రబాబు జగన్ ని ఎవరితో పోల్చారో తెలుసా ?
ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు.
By: Tupaki Desk | 25 July 2024 2:51 PM GMTఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత అయిదేళ్ళ వైసీపీ పాలనలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని ముఖ్యమంత్రి ఘాటు విమర్శలు చేశారు. దానికి అద్దం పట్టేలా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఇక జగన్ సీఎం గా ఉండడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అన్నారు. ఒక నేరస్తుడు పార్టీ అధినేతగా ఉన్నారని అలాగే సీఎం గా ఉన్నారని దాని వల్ల ఏమి జరిగిందో ఈ అయిదేళ్లలో ప్రజలంతా చూసారని చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఆయన గతానికి ఇప్పటికీ రాజకీయాలకు ఉన్న తేడాను వివరించారు. గతంలో నేరస్తులను రాజకీయ పార్టీలు, నేతలు సపోర్టు చేయాలంటే భయపడేవారని కానీ నేరస్తుడే పార్టీ అధినేతగా, ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయి మాఫియాను పెంచి పోషించారని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదని చంద్రబాబు అన్నారు.
జగన్ ని ఈ సందర్భంగా అంతర్జాతీయ నేతతో బాబు పోల్చారు. ఆయన గురించి సభలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ప్రపంచ చరిత్రలో పాబ్లో ఎస్కోబార్ అనే వ్యక్తి ఉండేవారని, ఆన కొలింబియన్ డ్రగ్ లార్డ్ అని అంతే కాదు నార్కో టెర్రరిస్ట్ అని చెప్పారు. ఆయన కూడా రాజకీయ నాయకుడు అయ్యారు.
డ్రగ్స్ అమ్మడానికి ఏకంగా కారిడాన్ ఏర్పాటు చేశాడని, డ్రగ్స్ విక్రయించి 30 బిలియన్ డాలర్లు సంపాదించాడని అన్నారు. అలా ఆయన 1976లో ఎస్కోబార్ అరెస్టైనా 1980లో అత్యంత ధనవంతుడు అయ్యాడని చెప్పారు. ఇక చూస్తే 1982లో కొలంబియా పార్లమెంట్ కు ఎంపీగా వెళ్లాడని, ఆయనని అమెరికా అరెస్టు చేయాలని చూస్తే నాటి కొలంబియా ప్రెసిడెంట్ తో మాట్లాడుకుని సొంత జైలు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటానని తప్పించుని పోయాడని బాబు ఈ చరిత్ర గురించి చెప్పారు.
ఇక ఆయన తరువాత కాలంలో లా మినిస్టర్ ను చంపేశాడని, 1985లో సుప్రీం కోర్టుపై దాడి చేసి 11 మంది జడ్జిలను తగలబెట్టారని, ఆ తర్వాత ఎన్నో దురాగతాలకు పాల్పడ్డారని ఆ ఉదంతం గురించి సభకు వివరించారు జగన్ విషయానికి వస్తే అంబానీ, టాటా కంటె ఎక్కువ డబ్బులు సంపాదించాలనేది ఆయన కోరిక అని అన్నారు. అయితే రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా నీతిగా చేయాలని ఆయన అన్నారు.
అయితే జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు అని బాబు మరోసారి గట్టిగా చెప్పారు. ప్రజలు కూడా ఈ విషయంలో ఆలోచన చేయాలని అన్నారు. రాజకీయాల్లో ఎవరు అయినా ఉండవచ్చు కానీ జగన్ మాత్రం అనర్హుడే అని తాను ఇదే పదే పదే చెబుతున్నాను అని జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ గురించి చెబుతూ కొలంబియాకు చెందిన నేతతో పోలిక తేవడం ఆయన గురించి బాబు చెప్పడంతో పాటు మీరు కూడా ఆ చరిత్ర చదవండి అని బాబు చెప్పడంతో సభలో ఎవరాయన అన్న ఆసక్తిని కలిగించారు .