Begin typing your search above and press return to search.

ఆ విషయంలో చంద్రబాబుది దొడ్డ మనసే!!

అయితే ఆ విమర్శలు హుందాగా ఉండాలని.. అంశాల వారీగా మాత్రమే ఉండాలని.. ఏమాత్రం శృతి తప్పి వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదని అంటారు.

By:  Tupaki Desk   |   3 July 2024 2:45 AM GMT
ఆ విషయంలో చంద్రబాబుది దొడ్డ మనసే!!
X

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అత్యంత సహజమనే సంగతి తెలిసిందే. అయితే ఆ విమర్శలు హుందాగా ఉండాలని.. అంశాల వారీగా మాత్రమే ఉండాలని.. ఏమాత్రం శృతి తప్పి వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదని అంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ప్రధానంగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు.. చంద్రబాబుపై వ్యక్తిగతంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొన్ని పైకి చెప్పలేనివి, జర్నలిస్టులు రాయలేని బాషను కూడా వాడిన పరిస్థితి. అయితే ఒకరిద్దరు మాత్రం అంశాల వారీగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారే తప్ప... వ్యక్తిగత విమర్శలు చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదు.

అలాంటి వారికి ఇటీవల ఏపీలో టిక్కెట్లు దొకరలేదని చెబుతుంటారు. ఉదాహరణకు కొలుసు పార్థసారధికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీలో కోరుకున్న టిక్కెట్ దక్కని సంగతి తెలిసిందే! ఈ విషయంపై స్పందించిన ఆయన... నేను ప్రత్యర్థులపై బూతులు మాట్లాడనందుకే తనకు అర్హత లేదని అధిష్టాణం భావించి ఉండొచ్చు అన్నట్లుగా వ్యాఖ్యానించారు.

దీంతో... టీడీపీలో చేరారు.. ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకున్నారు.. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిపదవి దక్కించుకున్నారు. దీంతో... గతంలో తనపై అంశాలవారీగా విమర్శలు చేసినా.. వాటిని రాజకీయ విమర్శలుగా మాత్రమే చంద్రబాబు చూశారని, అందుకే నాడు బూతులు మాట్లాడని పార్థసారధి విషయంలో హుందాగా ఆలోచించారని అంటున్నారు.

ఇదే సమయంలో... టీడీపీలోకి రాకముందు ప్రజారాజ్యం టు వైసీపీ వయా కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ పొలిటీషియన్ సీ. రామచంద్రయ్య విషయంలోనూ బాబు పెద్ద మనసు చాటుకుంటునారని అంటున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ జాబితాలో ఆయన పేరు ప్రముఖంగా ఉందని చెబుతున్నారు! గతంలో ఏ పార్టీలో ఉన్నా రామచంద్రయ్య... చంద్రబాబుపై అంశాల వారీగా విమర్శలు చేసినవారిలో ఒకరు!

దీంతో... చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రొఫెషనల్ పొలిటీషియన్ గానే ఉంటాయని అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో అది చాలా ముఖ్యమని.. అందుకే బాబు లాంగ్ పొలిటికల్ కెరీర్ కలిగి ఉన్నారని అంటున్నారు.