క్షణం తీరిక లేని చంద్రబాబు.. ఏం చేస్తున్నారంటే!
ఆదివారం సాయంత్రం మోడీ.. ప్రమాణ స్వీకారం సహా.. టీడీపీ నేతల.. కింజరాపురా మ్మోహన్‌నాయకుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ల ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నారు.
By: Tupaki Desk | 9 Jun 2024 8:38 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుకు క్షణం కూడా తీరికలేకుండా పోయింది. గత నెల 13న ఎన్నికల పోలింగ్ జరిగే వరకు ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఆ తర్వాత.. ఓ పది రోజుల విదేశాలకువెళ్లారు.అంతే.. అలా తిరిగి వచ్చారో లేదో పార్టీ నాయకులతో సమావేశాలు.. ఓట్ల లెక్కింపు రోజు ఎలా ఉండాలి? ఏం చేయాలనే విషయంపై దిశానిర్దేశంతోనే ఆ నాలుగు రోజులు గడిచిపోయింది. అంతేకాదు.. ఆ నాలుగు రోజుల్లోనూ.. జనసేన నాయకులు బీజేపీ నేతలతో సమాలోచనలు చేశారు.
ఇక, ఫలితం వచ్చిన తర్వాత... మరింత బిజీ అయిపోయారు. కేంద్రంలో బీజేపీకి మెజారిటీ దక్కక పోవ డంతో టీడీపీ ప్రాధాన్యం అమాంతంగా పెరిగిపోయింది. కేంద్రంలో బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడం.. టీడీపీకి ఒంటరిగానే 16 రావడంతో చంద్రబాబుకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే ఆయన రెండు సార్లు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ప్రధాని అభ్యర్థిగా మరోసారి మోడీని ఎంపిక చేయడంతో పాటు.. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఎంపిక చేయడంలోనూ ఆయన బిజీఅయ్యారు.
ఇక, కొంత విశ్రాంతి లభించిందని అనుకునే సరికి.. ఈనాడు అధిపతి రామోజీ రావు తుదిశ్వాస విడవడం తో కాలికి బలపం కట్టుకుని మళ్లీ హైదరాబాద్‌లో వాలిపోయారు. రోజు రోజంతా.. అక్కడే ఉండి ఆదివారం ఉదయం వరకు.. అంత్యక్రియలు జరిగే వరకు ఆయన పాల్గొన్నారు. ఇక, ఆ మరుక్షణమే మరోసారి ఆయన దుస్తులు మార్చుకుని ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం మోడీ.. ప్రమాణ స్వీకారం సహా.. టీడీపీ నేతల.. కింజరాపురామ్మోహన్‌నాయకుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ల ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నారు.
ఇక, అటు నుంచి మళ్లీసోమవారం ఉదయాన్నే ఏపీకి రానున్నారు. ఇక్కడ కొత్త సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లను తుదిసారి సమీక్షించుకోవాలి. ఇక, మంత్రి వర్గంలో ఎవరిని ఎంపిక చేయాలి.. ఎవరిని చేర్చుకోవాలి.. అనే విషయాలపైనా..చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇదేసమయంలో ఆహ్వాన పత్రికలను సిద్ధం చేసుకోవాలి. ఇలా.. మొత్తంగా చంద్రబాబు క్షణం తీరిక లేకుండా గడుపుతుండడం గమనార్హం.