Begin typing your search above and press return to search.

పవన్... బీజేపీ నుంచి బయటకు వచ్చేయ్...బాబు ఆర్డర్...?

పవన్ కళ్యాణ్ ముందు ఇపుడు రెండే రెండు ఆప్షన్లు ఉన్నయా అంటే అవును అనే జవాబు వస్తోంది

By:  Tupaki Desk   |   9 Dec 2023 5:17 PM IST
పవన్...   బీజేపీ  నుంచి బయటకు వచ్చేయ్...బాబు ఆర్డర్...?
X

పవన్ కళ్యాణ్ ముందు ఇపుడు రెండే రెండు ఆప్షన్లు ఉన్నయా అంటే అవును అనే జవాబు వస్తోంది. అందులో మొదటికి జనసేన బీజేపీ ఇప్పటిదాకా మిత్రులుగా ఉన్నాయి. దాంతో పాటు బీజేపీతో కలసి పవన్ కళ్యాణ్ తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేశారు. గెలుపోటములు సంగతి పక్కన పెడితే బీజేపీ టీడీపీ కంటే ముందు పవన్ తో కలసి పోటీ చేయడం ద్వారా మిత్రుడుగా గట్టిగా బంధం పెనవేసుకుంది.

ఇక ఏపీలో టీడీపీతో పవన్ తో పొత్తు ఉంది. ఈ రెండు పార్టీలు కలసి వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయాలని చూస్తున్నాయి. అయితే బీజేపీ కోసం రెండు పార్టీలు వెయిట్ చేస్తున్నాయని అంటున్నారు. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ విజయం తరువాతా జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు ఆలోచనలు మారుతున్నాయా అంటే జవాబు అవును అనే వస్తోంది.

ప్రత్యేకించి సాటి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. ఏపీలో టీడీపీ కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని ఉందో లేక మరేముందో తెలియదు కానీ బీజేపీ నుంచి బంధం తెంచుకుని బయటకు వచ్చేయమని పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు ఇటీవల జరిగిన భేటీలో గట్టిగా కోరారు అని అంటున్నారు. చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లినపుడు అనేక విషయాలు చర్చించారు. అయితే చంద్రబాబు ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ సామాజిక పరిస్థితులు పవన్ కి వివరించినట్లుగా తెలుస్తోంది.

ఏపీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లను పూర్తి స్థాయిలో కైవశం చేసుకోవాలంటే జనసేన బీజేపీ నుంచి మిత్రుత్వం కట్ చేసుకుని బయటకు వచ్చేయాలని చంద్రబాబు కోరినట్లుగా చెబుతున్నారు. ఏపీలో మొత్తం 37 రిజర్వుడు సీట్లు ఉన్నాయి. ఎస్సీ సీట్లు 29 ఉంటే ఎస్టీ రిజర్వుడు సీట్లు ఏడు కలిపి టోటల్ గా 37 సీట్లు ఉన్నాయి.

చూసుకుంటే కనుకైందులో ప్రతీసారి వైసీపీ మెజారిటీ సీట్లు గెలుస్తోంది. 2019 ఎన్నికల్లో అయితే మొత్తం 37కి ముప్పయి ఆరు సీట్లు గెచుకుంది. ఒకే ఒక్క సీటు రాజోలు జనసేన పరం అయింది. ఈ విషయాన్నే చంద్రబాబు పవన్ ముందు పెట్టారు అని అంటున్నారు. ఈ మొత్తం సీట్లలో వైసీపీ సాలిడ్ బలం చూపిస్తోందని దానిని బ్రేక్ వేయాలీ అంటే కచ్చితంగా బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు రావాలని పవన్ని చంద్రబాబు కోరినట్లుగా ప్రచారం సాగుతోంది

అంతే కాదు బీజేపీ పొత్తు వల్ల భారీ నష్టం రాజకీయంగా జరుగుతుంది అని కూడా చంద్రబాబు పవన్ కి చెప్పారు అని అంటున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సీట్లు కనుక జనసేన టీడీపీ కూటమి గెలవాలీ అంటే బీజేపీకి దూరంగా ఉండడమే బెటర్ అని పవన్ కి చంద్రబాబు హితబోధ చేసినట్లుగా చెబుతున్నారు

మరి పవన్ అయితే దీని మీద ఏమి ఆలోచిస్తారో తెలియదు అని అంటున్నారు. ఎందుకంటే పవన్ ఇటీవల విశాఖలో జరిగిన సభలో సైతం తన మనోభావాలను చెప్పారు. అది కూడా బాబు తో మీటింగ్ అయిన వెనువెంటనే విశాఖలో నిర్వహించిన మీటింగ్ అన్న మాట. కేంద్రంలో నరేంద్ర మోడీకి తాను మద్దతు ఇస్తోంది జాతీయ సమగ్రత కోసం దేశం కోసం అని పవన్ చెప్పుకొచ్చారు.

తనకు రాజకీయాలు కంటే దేశం రాష్ట్రం వాటి ప్రయోజనాలు ముఖ్యం అని పవన్ పదే పదే అంటున్నారు. ఇక మోడీ అంటే విపరీతమైన అభిమానం పవన్ చూపిస్తారు. అదే విధంగా తెలంగాణాలో జరిగిన ఎన్నికల సభలో మోడీతో పాటు పవన్ వేదిక పంచుకునారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మూడవసారి దేశానికి ప్రధానిగా మోడీ ఉండాలని బలంగా కోరుకున్నారు.

వీటన్నిటి బట్టి చూస్తే కనుక పవన్ కి అతి పెద్ద అంతర్మధనం అవుతుంది అని అంటున్నారు. బీజేపీని పవన్ వీడి వస్తే కనుక అది ఏపీ రాజకీయాల్లో కీలకమైన మలుపు కూడా అవుతుంది. మరి పవన్ నిర్ణయంతోనే ఏపీ పాలిటిక్స్ మలుపు తిరుగుతుంది అని అంటున్నారు. ఇక చంద్రబాబు కూడా మరో ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తులకు చూస్తున్నారు అని అంటున్నారు. పవన్ కనుక బీజేపీని వీడకపోతే ప్లాన్ బీని బాబు చాలా సులువుగా అమలు చేయగలరు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.