బాబు పవన్ భేటీ ఎపుడు..?
అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ జరిగి చాలా నెలలు అయింది. ఇటీవల ఈ ఇద్దరు నాయకులూ కలుస్తారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగినా ఎందుకో అది జరగలేదు. ఈ మధ్యలో అనేక పరిణామాలు కూడా చకచకా జరిగిపోయాయి.
By: Tupaki Desk | 30 July 2023 4:30 PM GMTఏపీలో తెలుగుదేశం సొంతంగా రాజకీయ పోరాటం చేసుకుంటూ పోతోంది. 2019లో ఓడిన తరువాత డే వన్ నుంచి చంద్రబాబు పోరాటాన్నే నమ్ముకున్నారు. అయితే పొత్తులు ఎత్తులు అన్నవి రాజకీయ వ్యూహాలు. వాటిని సైతం ఆయన ఎక్కడా వదలడంలేదు. ఆ మాటకు వస్తే 2024 లో కచ్చితంగా పొత్తులతోనే చంద్రబాబు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు.
ఈ విషయంలో రెండవ మాట కూడా లేదు అన్నది సుస్పష్టం. ఇక జనసేన విషయానికి వస్తే ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలరాదు అన్నది పవన్ కళ్యాణ్ పంతం పట్టుదల. అంతే కాదు 2019 మాదిరిగా ఈసారి ప్రయోగాలు చేయబోమని కూడా చాలా కాలం క్రితం అంటే ఎచ్చెర్ల మీటింగులో పవన్ క్లారిటీగా చెప్పారు.
ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందాలనుకోవడంలేదు అని కూడా పవన్ అన్నారు ఈ పరిణామాలను తీసుకున్నా రీసెంట్ గా ఆయన ఢిల్లీ వెళ్ళినపుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలు కలసివస్తాయని చెప్పడం చూసినా పొత్తులకు ఓకే అన్నట్లుగానే సీన్ ఉంది.
అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ జరిగి చాలా నెలలు అయింది. ఇటీవల ఈ ఇద్దరు నాయకులూ కలుస్తారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగినా ఎందుకో అది జరగలేదు. ఈ మధ్యలో అనేక పరిణామాలు కూడా చకచకా జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాలలో దాదాపుగా నెల రోజుల పాటు కలియతిరిగారు.
దానికి జనాల నుంచ్ విపరీతమైన రెస్పాన్స్ వచ్చినిద్. జనసేన గ్రాఫ్ బాగా పెరుగుతోంది అని కూడా చర్చ నడచింది. అది జరిగిన తరువాత ఎన్డీయే మీటింగ్ కి కూడా పవన్ ఢిళ్లీ వెళ్ళి వచ్చారు. అలా జాతీయ స్థాయిలోనూ గుర్తిపు లభించింది. ఇపుడు మూడవ విడత వారాహి యాత్రకు పవన్ సిద్ధపడుతున్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం పవన్ని నమ్మి ఆయననే మిత్రుడిగా చేసుకుంటూ ఎన్డీయే మీటింగ్ కి ఆహ్వానించింది.
చంద్రబాబుని అయితే పిలవలేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేనకు ఇపుడు జోరు బాగానే కనిపిస్తోంది. అదే టైం లో లోకేష్ యువ గళం పాదయాత్రతో పాటు చంద్రబాబు జిల్లా యాత్రలతో టీడీపీ కూడా జోష్ పెంచింది. మరి రెండు పార్టీలలో యాక్టివిటీస్ ఎవరివి వారివి అన్నట్లుగానే సాగుతున్నాయి.
వీటికి తోడు జనసేన పలు చోట్ల ఇంచార్జిలను నియమిస్తోంది. ఇది ఆ పార్టీలో ఎన్నడూ చూడని అనుభవం. ఆ సీట్లు అన్నీ టీడీపీకి కీలకమైనవి కావడం విశేషం. మరి కొన్ని చోట్ల కీలక నాయకులను జనసేనలోకి చేర్చుకుంటున్నారు. అలా పవన్ దూకుడు చేస్తూంటే టీడీపీ కూడా ఇంచార్జిలను ప్రకటిస్తోంది.
మరి ఇలా రెండు పార్టీలూ వేటికవే దూకుడు చేసుకుంటూ పోతే పొత్తులు కుదిరితే సీట్ల కోసం పేచీ రాదా అన్న చర్చ అయితే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ బాబు వైపు నుంచి కానీ చర్చలకు మాత్రం రంగం సిద్ధం కావడంలేదు.
దానికి కారణం ఏంటి అన్నది చూస్తే ఇందులో కూడా వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. జనసేన గ్రాఫ్ ఎన్నడూ లేని విధంగా వారాహి యాత్రతో పెరిగిందని, అలాగే కేంద్ర బీజేపీ పెద్దలకు అత్యంత నమ్మకస్తుడైన మిత్రుడిగా ఉండడంతో పొలిటికల్ గా పవన్ ఇమేజ్ కూడా పెరిగిందని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో తమతో చర్చలకు టీడీపీయే వస్తే సీట్ల దగ్గర రాయబేరాలకు తమకు పట్టు దొరుకుతుంది అన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉందని ప్రచారం సాగుతోంది.
అదే సమయంలో టీడీపీ కూడా జనసేన వద్దకు తాము స్వయంగా వెళ్ళినా లేక కలిసినా సీట్ల దగ్గర డిమాండ్ పెరిగి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని ఆలోచిస్తోంది అని అంటున్నారు. దాంతోనే వ్యూహాత్మకంగానే రెండు పార్టీలు కావాలనే ప్ ని మెయిన్ టెయిన్ చేస్తున్నాయని అంటున్నారు.
ఈ క్రమంలో పవన్ మూడవ విడత యాత్ర కూడా స్టార్ట్ చేస్తే మాత్రం యాభై సీట్లకు తగ్గేది అసలు ఉండదనే అంటున్నారు. జనసేనలో కొందరు నాయకుల మాట అయితే 60, 70 సీట్ల దాకా డిమాండ్ ఉండొచ్చు అని అంటున్నారు. ఆ పార్టీ శ్రేయోభిలాషి మాజీ మంత్రి హరి రామజోగయ్య అయితే 75 సీట్లను పొత్తులో భాగంగా జనసేన తీసుకోవాలని సూచించారు.
ఇక చూస్తే 2019 ఎన్నికల్లో జనసేన వల్ల ఏకంగా 53 సీట్లలో టీడీపీ ఘోరంగా దెబ్బ తింది. ఆ లెక్కలు అన్నీ కూడా పక్కాగానే ఉన్నాయి. మరి అన్ని సీట్లు తమ వల్ల అప్పట్లోనే ఇబ్బంది అయితే ఇపుడు పెరిగిన గ్రాఫ్ నేపధ్యంలో మరిన్ని కొత్త సీట్లు కూడా కలుస్తాయి కదా అన్నది జనసేన వాదన. అలా కనుక చూసుకుంటే తమకు యాభైకి తక్కువ కాకుండా సీట్లు ఇస్తే అది టీడీపీకి రాజకీయ లాభమని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ లెక్కలను టీడీపీ నేతలు పెద్దగా పట్టించుకోవడంలేదని అంటున్నారు. తాను ఇవ్వాలనుకున్న నంబర్ దగ్గరే వారు ఉండాలని చూస్తున్నారని, ఫలితంగా కొంత గ్యాప్ అయితే ఉందని అంటున్నారు.