బాబు కడిగిన ముత్యమే...ఎనీ డౌట్స్ ?
టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం దాదాపుగా అయిదు దశాబ్దాలు.
By: Tupaki Desk | 22 Aug 2024 3:44 AM GMTటీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం దాదాపుగా అయిదు దశాబ్దాలు. ఇంతటి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న నేతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరు. దేశంలో కూడా బాబు మాదిరిగా ఇందిరా గాంధీ కాలం నుంచి రాజకీయాలను చేస్తూ ఈ రోజుకీ డైనమిక్ గా ఉన్న నేత మరొకరు లేరు. బాబు మాదిరిగానే సీఎం గా అనేకసార్లు అయిన శరద్ పవార్ చాలా ఏళ్ల క్రితమే రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్ నుంచి తప్పుకున్నారు.
అలాగే ఇతర నేతలూ ఉన్నారు. కానీ బాబు మాత్రం నాటౌట్ అంటున్నారు. ఆయన వైఎస్సార్ తో రాజకీయం మొదలెట్టి ఆయన కుమారుడుతోనూ పోటీ పడి ఓడించి మరీ నాలుగోసారి గద్దెంక్కారు అంటే ఆయన అప్టూ డేట్ గా పాలిటిక్స్ చేస్తున్నట్లే లెక్క. ఇక బాబుని అవినీతిపరుడు అంటూ ఇప్పటికి నాలుగు దశాబ్దాలుగా ప్రత్యర్ధులు అంటూనే ఉన్నారు.
కానీ ఏ ఒక్కరూ ఎక్కడా వాటిని నిరూపించలేక పోయారు. బాబు ఎన్టీఆర్ చిన్నల్లుడిగా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచే ఈ రకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే అది 1985 నుంచి అన్న మాట. అలా విమర్శలు చేసిన వారు ఆయన మీద కోర్టుకు ఎక్కిన వారు సైతం ఏ ఒక్క ఆరోపణనూ రుజువు చేయలేకపోయారు. అందుకే బాబు నేను నిప్పుని అని బిగ్ సౌండ్ చేస్తారు.
ఆయన నిప్పు కాదని ప్రత్యర్ధులు అనవచ్చు. ఆయనకు మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయని ఆడి పోసుకోవచ్చు. కానీ ఆయన మీద సాధికారికంగా సహేతుకంగా కోర్టులలో ఫలనా తప్పు చేశారు అని నిరూపించలేక పోయారు అంటే అది బాబు గ్రేట్ నెస్ కాదా అని అంటున్నారు. మా బాబు బంగారం అని టీడీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటారు. ఈ దేశంలో ప్రతీ నాయకుడి మీద కోర్టు కేసులు ఉన్నాయి.
అలాగే వారి మీద ఆరోపణలు రుజువు అయి జైలు ఊచలు లెక్కపెట్టిన వారూ ఉన్నారు. మహా మహులు అంతా నెలల తరబడి జైలు గోడల మధ్యన మగ్గిన ఉదంతాలు ఉన్నాయి. అయితే బాబు గత ఏడాది జైలుకు వెళ్ళారు కదా అని అనవచ్చు. కానీ ఆ కేసులోనూ ఇంకా వాస్తవాలు బయటకు రావాలి కదా అని తమ్ముళ్ళు అంటున్నారు. బాబు మీద గత వైసీపీ ప్రభుత్వం కక్షతోనే కేసులు పెట్టిందని ఆయన నిప్పు అని అలాగే బయటకు వస్తారు అని కూడా అంటున్నారు.
ఇవన్నీ ఎందుకు అంటే లేటెస్ట్ గా బాబు మీద ఓటుకు నోటు కేసు అంటూ హోరెత్తించిన వైసీపీ ఇపుడు అత్యున్నత న్యాయస్థానంలోనూ అభాసుపాలు అయింది. రాజకీయ కక్షలతోనే పిటిషన్లు వేస్తున్నారు అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద కామెంట్స్ చేశారు అని అంటున్నారు అంటే బాబు కడిగిన ముత్యమే కదా. బాబు బ్రీఫ్డ్ మీ అని అన్నారని, అది ఆయన గొంతే అని ఆయన పేరుని ఎఫ్ ఐ ఆర్ లో పెట్టి విచారించాలని కోరుతూ వస్తున్న వైసీపీకి ఇది షాకింగ్ న్యూస్ గానే ఉంది.
ఈ నేపథ్యం నుంచి చూసినపుడు చంద్రబాబు కడిగిన ముత్యమని టీడీపీ అంటోంది. మరి ఇవన్నీ చూసిన వారికి రాజకీయంగా తలపండిన వారికి బాబు అవినీతిపరుడు అని ఎవరైనా అంటే కోపం రాదా. బాబు మీద ఏ ఒక్క కేసూ రుజువు కానపుడు ఆయన మీద ఏ రకమైనా న్యాయ పరంగా ఆక్షేపణ లేనపుడు బాబు కడిగిన ముత్యం కాకుండా ఎమవుతారు అన్నదే అఖిల భారత బాబు అభిమాన సంఘం వారి ప్రశ్న. బాబుని ఎవరైనా నిప్పు అనకుండా ఉండగలరా అంటే కూడా జవాబు లేదుగా. సో బాబు ఈజ్ గ్రేట్. ఎనీ డౌట్స్.