Begin typing your search above and press return to search.

సింగిల్ గానే అంటున్న చంద్రబాబు.... డేరింగ్ స్టెప్...?

చంద్రబాబు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఫలితాల పట్ల ఫుల్ ఖుషీగా ఉన్నారు. దాంతో ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చేది మేమే.

By:  Tupaki Desk   |   27 Aug 2023 11:11 AM GMT
సింగిల్ గానే అంటున్న చంద్రబాబు.... డేరింగ్ స్టెప్...?
X

చంద్రబాబు నోట చాలా కాలానికి సింగిల్ గా అన్న పదం వచ్చింది. ఈ పదం వైసీపీ తెల్లారిలేస్తే అనేక సార్లు అంటూ టీడీపీని చంద్రబాబుని చాలెంజి చేస్తూ ఉంటుంది. దమ్ముంటే టీడీపీ ఒంటరి పోరాటానికి సిద్ధం కావాలని, సింగిల్ గా రావాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంటుంది.

అయితే వైసీపీ ఎంత డిమాండ్ చేసినా టీడీపీ నుంచి వేరే రియాక్షన్ వస్తాయి. ఇంకో వైధంగా కామెంట్స్ వస్తాయి తప్ప సింగిల్ అన్న పదం మాత్రం రాదు. కానీ చంద్రబాబు ఇటీవల కాలంలో ఫస్ట్ టైం సింగిల్ గా అన్న పదం వాడారు. ఇది రాజకీయాల్లో అనేక చర్చలకు దారి తీస్తోంది. ఒక విధంగా చూస్తే బాబు అన్న సింగిల్ అన్న మాట సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ చంద్రబాబు అన్న సింగిల్ పదం ఎపుడు ఎలాంటి సందర్భంలో వాడారు అన్నది చూడాల్సి ఉంది. చంద్రబాబు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఫలితాల పట్ల ఫుల్ ఖుషీగా ఉన్నారు. దాంతో ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చేది మేమే. ఏపీలో అధికారం టీడీపీదే అంటూ బిగ్ సౌండ్ చేశారు.

సీ ఓటర్ సర్వే మేమే గెలుస్తామని చెప్పింది అని బల్ల గుద్దారు. అంతే కాదు సింగిల్ గానే 15 ఎంపీ సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పింది అని అంటున్నారు. ఇక్కడ సింగిల్ గా అన్న పదమే అండర్ లైన్ చేసుకోవాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఒంటరిగా టీడీపీ పోటీ చేస్తే ఓడిపోతుందని, ఓట్లు చీలి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని రకరకాలైన విశ్లేషణలు ఉన్నాయి.

అయితే సీ ఓటర్ సర్వే అలాంటి విశ్లేషణలను పక్కన పెడుతూ ఏపీలో ఏ పార్టీకి ఆ పార్టీ విడిగా పోటీ చేసినా టీడీపీకి సింగిల్ గా 15 ఎంపీ సీట్లు వస్తాయని నిర్ధారించింది. అంటే దీనిని అసెంబ్లీ సీట్లకు కన్ వర్ట్ చేసుకుంటే 105 సీట్లకు తక్కువ కాకుండా టీడీపీకి వస్తాయని తేలుతోంది.

ఇదే ఇపుడు టీడీపీకి గొప్ప ధైర్యాన్ని ఇస్తోంది. అందుకే ఈ సింగిల్ అన్న పాయింట్ ని స్ట్రెస్ చేస్తూ మరీ చంద్రబాబు మాకు ఒంటరిగానే ఇంత బలం ఉందని చెప్పుకుంటున్నారు అన్న మాట. ఇదే మాట ఆయన తనను సింగిల్ గా పోటీ అని పదే పదే సవాల్ చేస్తూ వస్తున్న వైసీపీకి సమాధానంగా చెబుతూనే అదే సమయంలో టీడీపీ ఒంటరిగా పోటీకి భయపడుతోంది అన్న వీక్ నెస్ ని అడ్డం పెట్టుకుని సీట్ల కోసం భారీగా డిమాండ్ చేయాలని చూసే పొత్తు పార్టీలకు కూడా క్లారిటీ ఇచ్చేందుకు ఈ పదం గట్టిగా వాడారని అంటున్నారు.

అంటే మాకు సింగిల్ గా వెళ్లినా గెలిచే సీన్ ఉందని చెప్పడమే బాబు ఉద్దేశ్యం. అదే విధంగా మేము సింగిల్ గానూ విక్టరీని పట్టగలమని వైసీపీకి చెప్పడం బాబు మార్క్ పాలిటిక్స్. అంతమాత్రం చేత టీడీపీ పొత్తులు లేకుండా పోటీకి వస్తుందని కాదు, పొత్తుల పేరిట ఎవరైనా సీట్లను ఎక్కువగా డిమాండ్ ఇక మీదట చేయకుండా ఉండేందుకు మాత్రం ఈ సీ ఓటర్ సర్వే టీడీపీకి బ్రహ్మాస్త్రంగా పనికి వస్తుందని అంటున్నారు.

అంటే ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో పాతిక సీట్లను పొత్తు పార్టీలకు వదిలేసి మిగిలిన 150 సీట్లలో పోటీ చేయాలని టీడీపీకి ఉంది. అలాగే పాతిక ఎంపీ సీట్లలో 22 దాకా టీడీపీ పోటీ చేసి మూడు ఎంపీ సీట్లకు మిత్రులకు ఇవ్వాలని మరో ప్రతిపాదన ఉందని ప్రచారంలో ఉంది.

అలా తన మాటను నెగ్గించుకోవడానికి టీడీపీ ఈ సింగిల్ అన్న పదాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటోంది అని అంటున్నారు. మొత్తానికి సీ ఓటర్ సర్వే వల్ల వైసీపీకి కలవరం చెలరేగిందో లేదో తెలియదు కానీ టీడీపీని పొత్తుల పేరిట వీలైనంతగా వంచేసి సీట్లు గుంజేసుకోవాలని చూసే పొత్తు పార్టీలకు మాత్రం యమ డేంజర్ సిగ్నల్ గా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయని అంటున్నారు.