Begin typing your search above and press return to search.

డోలాయ‌మానంలో త‌మ్ముళ్లు.. చంద్ర‌బాబు క‌ష్టం ఫ‌లించేనా?

అయితే.. త‌మ్ముళ్ల‌లో ఇనాక్టివ్ కి కార‌ణం.. పార్టీ అనుస‌రిస్తున్న విధానాలేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 3:30 PM GMT
డోలాయ‌మానంలో త‌మ్ముళ్లు.. చంద్ర‌బాబు క‌ష్టం ఫ‌లించేనా?
X

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక‌వైపు పార్టీని అధికారంలోకి తీసుకువ చ్చేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నానా ప్ర‌యాస ప‌డుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని మ‌రీ తిరుగుతున్నారు. త‌మ్ముళ్ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నా రు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తున్నారు. ఇంకోవైపు.. యాత్ర‌లు చేస్తున్నారు. సీమ‌, ఉత్త‌రాంధ్ర‌, కోస్తాంధ్ర జిల్లాల్లో వారాల త‌ర‌బ‌డి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

సో.. మొత్తంగా చూస్తే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబులో గెల‌వాల‌నే కాంక్ష‌, అధికారంలోకి రావాల‌నే ఆకాంక్ష రెండు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. క‌ట్ చూస్తే.. క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్ల ప‌రిస్థితి ఏంటి? వారు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే..చంద్ర‌బాబు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌స్తే త‌మ్ముళ్లు యాక్టివ్‌గా ఉంటున్నారు. బాబు ప‌ర్య‌ట‌న ముగియ‌గానే త‌మ దారిలో తాము ఉంటున్నారు.

దీంతో చంద్ర‌బాబు ల‌క్ష్యం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయితే.. త‌మ్ముళ్ల‌లో ఇనాక్టివ్ కి కార‌ణం.. పార్టీ అనుస‌రిస్తున్న విధానాలేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తు తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం 20 లోపు నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్ర‌మే నాయ‌కు ల‌ను చంద్ర‌బాబు కన్ఫ‌ర్మ్ చేశారు. అంటే.. వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తార‌న్న‌మాట‌. ఇక‌, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా మంది ఎదురు చూస్తున్నా.. వారికి టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేయ‌డం లేదు.

ఈ ప‌రిణామం.. నాయ‌కుల్లో నిర్వేదానికి కార‌ణంగా మారింది. తాము ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఇర‌గ‌దీ సుకుని ఖ‌ర్చు పెట్టి క‌ష్ట‌ప‌డితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ల‌భిస్తుంద‌న్న గ్యారెంటీ వారికి క‌నిపించ‌డం లేదు. అందుకే మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ్ముళ్లు నిర్వేదంలో కూరుకుపోయారు. ఇక‌, కీల‌క‌మైన ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో పొత్తుల విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న సాగుతోంది. ఇక్క‌డ జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే.. త‌మ‌కు టికెట్ ద‌క్కుతుందా? లేదా? అని త‌మ్ముళ్లు సందేహిస్త‌న్నారు.

దీంతో ప‌ట్టున్న తూర్పు గోదావ‌రి వంటి జిల్లాల్లోనూ త‌మ్ముళ్లు ముందుకు సాగ‌డం లేదు. టికెట్ ఇచ్చాక చూసుకుందాం లే! అనే ధీమాతో ఉండి పోతున్నారు. ఇలా.. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ హ‌డావుడి త‌ప్ప‌.. త‌మ్ముళ్ల హ‌డావుడి మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.