Begin typing your search above and press return to search.

బాబు ప్రిపరేషన్ చూస్తే కూటమి కొట్టేసినట్లేనా !?

అదే విధంగా అమరావతి లోనే చంద్రబాబు సీఎం గా ప్రమాణం చేస్తారని అంగరంగ వైభవంగా ఆ ప్రమాణ స్వీకార ఘట్టం ఉంటుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   31 May 2024 7:11 AM GMT
బాబు ప్రిపరేషన్ చూస్తే కూటమి కొట్టేసినట్లేనా !?
X

టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సైలెంట్ గా తన పని తాను కానిచ్చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు పోలింగ్ సరళి పోస్ట్ పోల్ సర్వేలు తనకు ఉన్న అంచనాలు ఇలా అన్నింటి మీద చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. ఆరు నూరు అయినా ఈసారి అధికారం మార్పు తధ్యమని బాబు భావిస్తున్నారుట.

అంతే కాదు టీడీపీ కూటమి చాలా కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారుట. ఇక సోలోగానే టీడీపీకి మెజారిటీ రావచ్చు అన్నది బాబుకు ఉన్న అంచనాలు అని చెబుతున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు ఏ మాత్రం కంగారు పడకుండా చాలా నెమ్మదిగా ఉన్నారు. వార్ వన్ సైడ్ అయిందని బాబు గట్టిగా నమ్ముతున్నారని తెలుస్తోంది.

ఆయన సీఎం గా తన ప్రమాణ స్వీకారానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. చంద్రబాబు సీఎం గా తన తొలి ప్రసంగాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. అంతే కాదు తన ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని పిలవాలన్నది కూడా బాబు లిస్ట్ రెడీ చేసుకుంటున్నారు అని అంటున్నారు.

వీలు అయితే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షాను పిలవాలని బాబు డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. జూన్ 9న మంచి ముహూర్తం ఉందని పండితులు చెబుతున్నారు. అలాగే ఆ తరువాత ముహూర్తాలు కూడా చూస్తున్నారు. మొత్తానికి ఈ విషయంలో కూడా పండితులతో టీడీపీ పెద్దలు చర్చలు జరుపుతున్నారుట.

అదే విధంగా అమరావతి లోనే చంద్రబాబు సీఎం గా ప్రమాణం చేస్తారని అంగరంగ వైభవంగా ఆ ప్రమాణ స్వీకార ఘట్టం ఉంటుందని అంటున్నారు. ఇక సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవ ఘట్టంలో పాల్గొనే ముఖ్య అతిధుల జాబితాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా ఉందని అంటున్నారు. ఈ అతిధులను ఆహ్వానించే బాధ్యతలను పార్టీలోని కొందరు ముఖ్యులకు బాబు అప్పగించారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే సీఎంగా ప్రమాణం చేయడానికి అధికారులతో సంప్రదింపులకు ఒక కీలక నేతకు బాబు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఇక చంద్రబాబు ఈసారి తన పాలనలో కొత్తదనాన్ని కూడా చూపించాలని ఆత్రపడుతున్నారు అని అంటున్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారికి ఆయన ఇదే విషయం చెబుతున్నారుట.

చంద్రబాబు ఈసారి తన మంత్రివర్గాన్ని జగన్ తరహాలో రెండు విడతలుగా విస్తరిస్తారు అని అంటున్నారు. రెండున్నరేళ్ల తరువాత పాతవారిని పక్కన పెట్టేసి వారి ప్లేస్ లో మరింతమంది ఆశావహులను తీసుకుంటారు అని అంటున్నారు. దీని వల్ల ఎక్కువ మందికి క్యాబినెట్ బెర్త్ ని ఇచ్చేందుకు వీలు అవుతుందని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

అదే విధంగా సైన్‌మెంట్ ల్యాండ్ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రాబు తొలి సంతకం చేస్తారు అని అంటున్నారు. అంటే బాబు ప్రమాణ స్వీకారం వేదిక అతిధుల లిస్ట్, మంత్రి వర్గం కూర్పు తొలి సంతకం ఇలా చాలా జోరుగానే తెర వెనక కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. ఇంతలా బాబులో ధీమాను చూసిన వారు తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుంది అని నమ్ముతున్నారు. దాంతో ఈసారి మనదే పవర్ అని తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు.