మరోసారి ప్రధానిగా మోడీ.. చంద్రబాబు ప్రతిపాదన
ఇదిలావుంటే.. తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి పార్టీల సమావేశంలో నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఈ క్రమంలో తొలి వాక్యాలు చంద్రబాబు పలికారు.
By: Tupaki Desk | 7 Jun 2024 7:59 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కేంద్రంలో కింగ్ మేకర్‌గా అవతరించారు. తాజాగా జరిగిన సార్వత్రి క ఎన్నికల్లో 25 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 21 స్థానాల్లోవిజయం దక్కించుకుంది. అయితే.. టీడీపీ ఒంటరిగానే 16 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో చంద్రబాబుకు భారీ చేకూరినట్టు అయింది. మరోవైపు.. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావించిన బీజేపీకి కేవలం 240 స్థానాలు మాత్రమే దక్కాయి.
దీంతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలన్న బీజేపీ ఆకాంక్ష నెరవేరేందుకు.. చంద్రబాబు ద న్ను అవసరమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు కూడా... సముచిత స్థానం క ల్పించారు. మంత్రి పదవుల్లోనూ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇదిలావుంటే.. తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి పార్టీల సమావేశంలో నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఈ క్రమంలో తొలి వాక్యాలు చంద్రబాబు పలికారు.
నరేంద్ర మోడీని మూడో సారి ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నామని.. చంద్రబాబు చెప్పారు. ఈ ప్రకటన చేయడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ''సగర్వంగా.. మోడీని మూడోసారి ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నాం'' అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రకటన చేసిన సమయంలో ఎన్డీయే పక్షాల అభ్యర్థులు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ.. బల్లలు చరుస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం.. ఎన్డీయే కూటమి పార్టీల నాయకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకోనున్నారు. ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసేలా తమను ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా.. శుక్రవారం సాయంత్రానికి రానున్నాయి. దీంతో ప్రభత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ముందుగానే నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం.. ఆదివారం మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.