Begin typing your search above and press return to search.

బాబు స్కీమ్స్ కి ముహూర్తం రెడీ !

ఇదిలా ఉంటే ఏపీలోని మహిళలు అందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పిస్తామని సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 1:30 AM GMT
బాబు స్కీమ్స్ కి ముహూర్తం రెడీ !
X

ఏపీ సీఎం చంద్రబాబు తాను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మననం చేసుకుంటున్నారు. వాటిని అమలు చేసేందుకు సరైన సమయం కూడా ఆయన చూసుకుంటున్నారు. ఈ నెల 24న జరిగే మంత్రివర్గ సమావేశంలో బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు ఎప్పటి నుంచి చేయాలి అన్న దాని మీద లోతుగా చర్చిస్తారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలోని మహిళలు అందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పిస్తామని సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చారు. ఇది చాలా ఆకర్షణీయమైన పధకంగా ఉంది. మధ్యతరగతి వర్గాలు దీని కోసమే కూటమికి ఓట్లు గుద్దేశారు. తెల్లారి లేస్తే ఉద్యోగాల కోసం బస్సు పాసుల పేరిట వేలల్లో చెల్లిస్తూ ఆపసోపాలు పడే వారికి ఇది ఎంతో ఊరటను ఇచ్చే పధకం.

ఈ పధకం అమలు చేయాలే కానీ ప్రతీ మధ్యతరగతి మహిళ పర్సు లో రెండు వేల రూపాయల దాకా అలా ఆదా అవుతూ కొత్త సొమ్ము జమ అయినట్లుగానే ఉంటుంది. దాంతో ఈ స్కీమ్ కోసం వారంతా చూస్తున్నారు. అయితే ఈ స్కీమ్ అమలుకు ముహూర్తాన్ని కూటమి ప్రభుత్వం సెట్ చేసింది అని అంటున్నారు.

జూలై మొదటి వారం నుంచే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే సదుపాయాన్ని కలిపిస్తారని ఆ నాటి నుంచే అమలులోకి వస్తుందని అంటున్నారు. ఈ మేరకు తగిన ప్రతిపాదనలు రవాణా శాఖ తయారు చేస్తోంది. ప్రభుత్వం ఆ దిశగా డైరెక్షన్స్ కూడా ఇచ్చిందని అంటున్నారు.

ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే ఎంత ఖర్చు ఆర్టీసీకి అవుతుంది. ప్రభుత్వం ఏ విధంగా దాన్ని సమకూర్చుకోవాలి అన్న దాని మీదనే ఇపుడు కసరత్తు సాగుతోంది అని అంటున్నారు. అంతే కాదు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతీ మహిళ ఇంటికీ అందిస్తామని టీడీపీ మరో హామీ ఇచ్చింది.

దానిని కూడా జూలై నుంచి అమలు చేయడానికి సిద్ధం అవుతోంది అని అంటున్నారు. అయితే ఇందులో కొంత మార్పులు చేస్తున్నారు. ఈ సిలిండర్లను నెలకు ఒకసారి వంతున వరసగా మూడు నెలలకూ కాకుండా ప్రతీ నాలుగు నెలలకూ ఒక సిలిండర్ ని ఉచితంగా అందించాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వం మీద తక్షణ భారం ఉండదని అదే విధంగా ఏడాది పొడవునా ఈ పధకం గురించి ప్రచారం సాగుతుంది. వారిని సరైన సమయానికి అందిస్తూండడం జరుగుతుందని అంటున్నారు. అంటే జూలైలో ఒక సిలిండర్ ని ఉచితంగా ఇస్తే నవంబర్ లో మరోటి ఇస్తారు. ఇక చివరికి మార్చిలో ఇస్తారు అన్న మాట. ఇలా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఎంతో వెసులుబాటు కూడా ఉంటుందని భావిస్తున్నారు.

దాని ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ 800 రూపాయలు పైదాటి ఉంది. ఇలా ఏడాదిలో మూడు సిలిండర్లు ఇస్తే ఏకంగా రెండు వేల అయిదు వందల రూపాయల దాకా ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందుతున్నట్లే అని అంటున్నారు. ఈ పధకం సక్సెస్ ఫుల్ గా చేస్తే మహిళా లోకం ఎప్పటికీ టీడీపీకే కట్టుబడి ఉంటుందని అంటున్నారు.

ఇక పెన్షన్ పధకం తీసుకుంటే జూలైలో ఏకంగా ఏడు వేల రూపాయలను సామాజిక పెన్షన్ దారులు అందుకోబోతున్నారు. దానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో చర్చిస్తారు అని అంటున్నారు. ఇలా మూడు పధకాలకు

మంత్రివర్గం ఆమోదం తెలిపి పచ్చ జెండా ఊపుతుందని వాటి అమలుకు డేట్స్ కూడా ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు.