Begin typing your search above and press return to search.

మ‌రిది ముఖ్య‌మంత్రికి ఎంపీ వ‌దిన‌మ్మ విన్న‌పాలు!

గ‌తంలో వైసీపీ హ‌యాంలో పురందేశ్వ‌రి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి ఇసుక క్వారీల‌ను త‌నిఖీ చేసిన విష యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Jun 2024 8:03 AM GMT
మ‌రిది ముఖ్య‌మంత్రికి ఎంపీ వ‌దిన‌మ్మ విన్న‌పాలు!
X

సీఎం చంద్రబాబుకు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు.. వ‌రుసకు వ‌దిన అయ్యే ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కీలక వినతులు స‌మ‌ర్పించారు. వినతులతో కూడిన లేఖను బీజేపీ చీఫ్ పురందేశ్వరి.. చంద్రబాబుకు పంపారు. ఇందులో వైసీపీ హయాంలో జరిగిన మద్యం, ఇసుక మాఫియాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇసుక తవ్వకాలకు డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూడాలని, బీజేపీ రాష్ట్ర కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

గ‌తంలో వైసీపీ హ‌యాంలో పురందేశ్వ‌రి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి ఇసుక క్వారీల‌ను త‌నిఖీ చేసిన విష యం తెలిసిందే. అదేవిధంగా ప‌లు గ‌నుల‌ను కూడా ఆమె సంద‌ర్శించి.. అక్క‌డ జ‌రుగుతున్న వైలేష‌న్ల ను గుర్తించారు. ఈ క్ర‌మంలో 120 పేజీల నివేదిక‌ను కేంద్రానికి పంపించి.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. కానీ, కేంద్రం సానుకూలంగా స్పందించ‌లేదు. ఇప్పుడు అవే నివేదిక‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆమె పంపించి.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

ఇక‌, గ‌త ప్ర‌భుత్వంలోనే బీజేపీకి రాష్ట్ర కార్యాల‌యం నిర్మించుకునేందుకు స్థ‌లం కేటాయించాల‌ని పురందేశ్వ‌రి విన్న‌వించారు. కానీ, వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారును ఆమె మ‌రోసారి విన్న‌వించారు. విజ‌య‌వాడ‌, గుంటూరు ప‌రిస‌ర ప్రాంతాల్లో 5 ఎక‌రాల స్థ‌లం కావాల‌న్నది పురందేశ్వ‌రి విన్న‌పం. పైగా జాతీయ ర‌హ‌దారిని ఆనుకుని ఉన్న భూమిని కేటాయించాల‌ని గ‌తంలోనే కోరారు. జాతీయ నేత‌లు వ‌చ్చిన‌ప్పుడు.. ఇక్కడ బ‌స చేసేందుకు వీలుగా .. ఐదు అంస్థ‌లు భ‌వ‌నం నిర్మించేందుకు బీజేపీ ప్లాన్ సిద్ధం చేసుకుంది. కాగా, పురందేశ్వ‌రి విన్న‌పాల‌పై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.