Begin typing your search above and press return to search.

ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ సమయంలో తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

By:  Tupaki Desk   |   2 Jun 2024 12:28 PM GMT
ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన అనంతరం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇందులో భాగంగా ఏపీలో ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును.. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... కూటమి గెలుపుకోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్, పురదేంశ్వరి ప్రస్థావన తెచ్చారు.

ఇందులో భాగంగా ఏపీలో కూటమి విజయం సాధించడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు చాలా బాగా కష్టపడ్డారన్నారని తెలిపారు. ఇదే క్రమంలో.. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించిన వైఖరులపై నేతలతో చర్చించారు.

ఆదివారం మధ్యాహ్నం కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు... ఈ మేరకు కూటమి నేతలకు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి, ఆ పార్టీ నేత అరుణ్ సింగ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపాయని.. ఫలితంగా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్నారు. ఈ సమయంలో ఓటమి భయంతోనే కౌంటింగ్‌ పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు.

ఇక ఇప్పటికే వైసీఇపీ నేతలు తమ పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో ఉన్నారని ఎద్దేవా చేసిన చంద్రబాబు... కౌంటింగ్ రోజు కూడా పలు అక్రమాలు, అనేక దాడులకు తెగబడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కేంద్రంలోనే ఉండాలని తెలిపారు.