Begin typing your search above and press return to search.

షర్మిల మీద ఫస్ట్ టైం : అలెర్ట్ అయిన చంద్రబాబు...!?

కాంగ్రెస్ పార్టీ ఏపీలో లేవడానికి చూస్తోంది. అయితే ఆ లేచేది ఏ స్థాయిలో అన్నది ఇప్పటికైతే తెలియదు

By:  Tupaki Desk   |   6 April 2024 4:47 PM GMT
షర్మిల మీద ఫస్ట్ టైం : అలెర్ట్ అయిన చంద్రబాబు...!?
X

కాంగ్రెస్ పార్టీ ఏపీలో లేవడానికి చూస్తోంది. అయితే ఆ లేచేది ఏ స్థాయిలో అన్నది ఇప్పటికైతే తెలియదు. నిజానికి కాంగ్రెస్ ఏపీలో పోటీ వల్ల వైసీపీ ఓట్లను చీలుస్తుందని అనుకున్నారు. కానీ ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. విపక్షంలో ఉంటే అదే జరిగి ఉండేది. కానీ పవర్ లో ఉన్న పార్టీకి సాలిడ్ గా దాని ఓటు బ్యాక్ ఉంటుంది. వద్దు అనుకున్న ఓట్లే విపక్షానికి వెళ్తాయి.

అలా విపక్షం ఓట్లు అన్నీ చీలకుండా టీడీపీ జనసేనతో బీజేపీతో కూటమి కట్టింది. కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్ వేరే కూటమితో ముందుకు వస్తోంది. ఉభయ కమ్యునిస్ట్ పార్టీలతో కలసి ఇండియా కూటమిగా ఏపీలో వస్తోంది. ఇక ఆ పార్టీకి షర్మిల నాయకత్వం వహిస్తున్నారు

దాంతో ఎంతో కొంత బలం పెరుగుతుంది అని అంటున్నారు. ఆ పెరిగిన బలం ఆ ఓట్లు అన్నీ కూడా విపక్ష కూటమి నుంచే చీలుతాయని అంటున్నారు. లేటెస్ట్ గా వస్తున్న సర్వేలు చూస్తే వైసీపీకి టీడీపీకి మధ్య ఓట్ల షేర్ లో గ్యాప్ పెరుగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ ఓటు షేర్ 2019 నాటి కంటే రెండు మూడు శాతం పెరుగుతోంది. దాంతో ఆ ఓట్లు అన్నీ కూడా టీడీపీ కూటమి నుంచే తీసుకుంటున్నారు అని అర్ధం అవుతోంది.

దాంతో చంద్రబాబు అలెర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఆయన ఇప్పటిదాకా కాంగ్రెస్ మీద విమర్శలు చేయలేదు. కానీ ఫస్ట్ టైం ఆయన పల్నాడు జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటూ కామెంట్స్ చేశారు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కొత్త నాటకం ఆడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీని జగన్ కి తెలంగాణాను షర్మిలకు విజయమ్మ రాసి ఇచ్చారని కానీ ఇద్దరూ న్యాయం చేయలేదని వీరు రాష్ట్రానికి ఏమి చేస్తారు అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం ఆడుతోందని అందుకే షర్మిల ఏపీకి వచ్చారు అని ఆయన మండిపడ్డారు.

దేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన అంటూ ఎండీయేకు పడే ఓట్లను జగన్ షర్మిల చీల్చడానికి చూస్తున్నారు అని విమర్శించారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో చూసుకోవాలి తప్ప బయట రాజకీయం ఏంటని ఆయన షర్మిలకు ఘాటు గానే ఇచ్చి పడేశారు.

మొత్తం మీద చూస్తూంటే షర్మిల గురించి కానీ కాంగ్రెస్ మీద కానీ ఒక్క మాట కూడా ఇప్పటిదాకా అనని చంద్రబాబు ఇపుడు సడెన్ గా టోన్ మార్చారు అంటే వైసీపీ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ చీలుస్తోందని ఆయన ఆందోళన చెందుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఈసారి ఎన్నికలు హోరా హోరీగా సాగనున్నాయి. చాలా నియోజకవర్గాలలో మూడు వందలు రెండు వందలు ఆఖరుకు వంద ఓట్లు కూడా విజయాన్ని డిసైడ్ చేస్తాయి. అలాంటపుడు ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్ వేయి ఓట్లను చీల్చినా అది కూటమికి దెబ్బ అని చంద్రబాబు భావిస్తున్నారు అని అంటున్నారు.

మొత్తం మీద షర్మిలకు ఇప్పటిదాకా బాబు మద్దతుగా ఉంటున్నారు. కాంగ్రెస్ టీడీపీ ఒక్కటే అని వైసీపీ ఆరోపణలు చేస్తూంటే మౌనం వహించిన టీడీపీ అధినేత ఇపుడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటూ గొంతు పెంచడం మీద చర్చ సాగుతోంది. లేటెస్ట్ సర్వేల ఫలితాలను చూసిన మీదటనే ఆయన ఇలా రూట్ మార్చారు అని అంటున్నారు. చూడాలి మరి ఫ్యూచర్ లో షర్మిల మీద చంద్రబాబు ఎలాంటి విమర్శలు చేస్తారో దానికి ఆమె ధీటుగా ఎలా బదులిస్తుందో అన్నది కూడా ముందు ముందు తేలనుంది.