Begin typing your search above and press return to search.

దేవినేని ఉమాకు షాక్ ఇవ్వబోతున్న బాబు...!?

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ పవర్ ఫుల్ లీడర్ దేవినేని ఉమా మహేశ్వరరావు. ఆయన 1999 నుంచి రాజకీయాల్లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 3:46 AM GMT
దేవినేని ఉమాకు షాక్ ఇవ్వబోతున్న బాబు...!?
X

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ పవర్ ఫుల్ లీడర్ దేవినేని ఉమా మహేశ్వరరావు. ఆయన 1999 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తన అన్న దేవినేని వెంకట రమణ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఉమా అనేక సార్లు గెలిచారు. 2014 నుంచి 2019 దాకా కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన మొదట నందిగామ నుంచి 1999, 2004లలో విజయం సాధించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన తరువాత మైలవరం నుంచి 2009, 20014లలో మరో రెండు సార్లు గెలిచారు.

ఇక 2024లో మైలవరం నుంచే తాను పోటీ చేస్తాను అని ఉమా పట్టుదల మీద ఉన్నారు. అయితే ఆయన ఆశలను చంద్రబాబు నెరవేర్చడంలేదు అని అంటున్నారు. మైలవరంలో ఉమాకు వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది. సొంత పార్టీ వారే ఆయన వద్దు అంటున్నారు. అక్కడ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు టికెట్ ని ఆశిస్తున్నారు. తాను పక్కా లోకల్ అని ఆయన అంటున్నారు.

నందిగామ నుంచి వచ్చిన ఉమాను భుజాల మీద మోసి రెండు సార్లు గెలిపించామని ఈసారి చాన్స్ తమకే ఇవ్వాలని ఆయన అంటున్నారు. ఆయన కోరిక అలా ఉండగానే వైసీపీ నుంచి మైలవరం సీటులో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి రానున్నారు. ఆయన మైలవరం సీటుని గట్టిగా కోరుకుంటున్నారు. ఆయనకు చంద్రబాబు హామీ కూడా దక్కింది అని అంటున్నారు.

ఆ హామీ మేరకే ఆయన వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు అని అంటున్నారు. దీంతో ఉమాకు వేరే సీటు చూపిస్తారు అని అంటున్నారు. ఆయనను పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయమని అధినాయకత్వం సూచిస్తుంది అని అంటున్నారు. పెనమలూరులో కూడా టీడీపీ బలంగా ఉంది.

అయితే దేవినేని ఉమా మాత్రం తాను మైలవరం నుంచి కదిలేది లేదు అని అంటున్నారు. చంద్రబాబు ఉమాకు ఎంతో ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. కానీ మొదటి సారి బాబు షాక్ ఇవ్వబోతున్నారు. దాంతో ఉమా దీన్ని తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. అయితే సర్వే నివేదికలను ఆసరాగా చేసుకుని మాత్రమే ఈ విధంగా మార్పులు చేస్తున్నట్లుగా అధినాయకత్వం చెబుతోంది.

ఉమాకు టికెట్ ఇస్తే సొంత పార్టీ వారు సహకరించరని, అదే విధంగా మరోసారి వైసీపీ చేతిలోకి సీటు పోతుందని టీడీపీ హై కమాండ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఉమాకు స్థాన చలనం ఖాయమని అంటున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే కానీ దేవినేని ఉమా మాత్రం ససేమిరా అంటున్నారు. చివరికి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.