Begin typing your search above and press return to search.

ఎక్క‌డ త‌గ్గాలో.. తెలిసిన నాయ‌కుడు చంద్ర‌బాబు.. ఇదీ ఎగ్జాంపుల్‌!

ఇది నాటి ప‌రిపాల‌న ఎలా ఉందో చెప్ప‌డానికి మ‌చ్చుతునక‌.

By:  Tupaki Desk   |   11 Jun 2024 2:39 PM GMT
ఎక్క‌డ త‌గ్గాలో.. తెలిసిన నాయ‌కుడు చంద్ర‌బాబు.. ఇదీ ఎగ్జాంపుల్‌!
X

ఎంత ఎత్తుకు ఎదిగామ‌న్న‌ది కాదు.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంత ఒదిగి ఉన్నామ‌న్న‌ది ముఖ్యం. ఈ విష‌యంలో గ‌త ముఖ్య మంత్రి జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆరుద్ర అనే మ‌హిళ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు తాడేప‌ల్లికి వ‌స్తే.. క‌నీసం అప్పాయింట్ మెంట్ ద‌క్క‌క పోగా వైసీపీ నేత‌ల నుంచి బెదిరింపులు వ‌చ్చిన సంఘ‌ట‌న తెలిసే ఉంటుంది. దీంతో ఆమె ఏకంగా రాష్ట్రం విడిచి మ‌రీ పారిపోయారు. తాజాగా వార‌ణాసి నుంచి తాను మ‌ళ్లీఏపీకి వ‌స్తున్న‌ట్టు చెప్పిన విష‌యం కూడా తెలిసిందే. ఇది నాటి ప‌రిపాల‌న ఎలా ఉందో చెప్ప‌డానికి మ‌చ్చుతునక‌.

కానీ, చంద్ర‌బాబు ఇంకా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండానే.. ఎలా ఒదిగి ఉండాలో.. ఎక్క‌డ త‌గ్గాలో నిరూపిస్తున్నారు. చంద్ర‌బాబు ను చూడాలి అంటూ కాన్వాయ్ వెంట మహిళ పరుగులు పెట్ట‌డాన్ని గ‌మ‌నించిన బాబు.. త‌న కారును ఆపి మాట్లాడిన చంద్రబాబు ఆమెను ఉత్సాహ ప‌రిచారు. దీంతో ఆమె సంతోషం వ్య‌క్తం చేశారు. ఏం జ‌రిగిందంటే.. ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు.

విజ‌య‌వాడ‌లోని ఏ కన్వెన్షన్ హాల్‌లో జ‌రిగిన‌ కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి.. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది. తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు.

సెక్యూరిటీని వారించి మ‌రీ చంద్ర‌బాబు స‌ద‌రు మ‌హిళ వివరాలు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుతో ఆమె మాట్లాడుతూ.. ``మా కష్టం ఫలించి....మా కోరిక మేరకు మీరు సిఎం అయ్యారు సార్....ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతాను`` అంటూ ఆ మహిళ వేడుకుంది. అయితే... చంద్రబాబు ఆమె అభ్య‌ర్థ‌న‌ను సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చాను అని నందిని చెప్పగా.. ``ముందు ఆసుపత్రికి వెళ్లమ్మా`` అని చంద్ర‌బాబు సూచించారు.

అంతేకాదు ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని వైద్య సేవ‌లు అందించాల‌ని పార్టీ ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేశారు. చిత్రం ఏంటంటే.. ఇప్పుడు చంద్ర‌బాబు క్ష‌ణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలోనూ త‌న‌ను చూసేందుకు వ‌చ్చిన మ‌హిళ‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించి.. ఆమెను సంతోషం క‌లిగించ‌డ‌మే!!