Begin typing your search above and press return to search.

బాబు సింపతీ ఎంత : తెలంగాణా ఎన్నికలు తేల్చేస్తాయా...?

చంద్రబాబు సైతం దూకుడుగా అగ్రెస్సివ్ గా తెలంగాణా ఎన్నికల్లో పనిచేస్తారు అని అంటున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 3:15 AM GMT
బాబు సింపతీ ఎంత :  తెలంగాణా ఎన్నికలు తేల్చేస్తాయా...?
X

చంద్రబాబు అరెస్ట్ తరువాత అతి సమీపంలో జరుగుతున్న ఎన్నికలు తెలంగాణాలోనే ఉన్నాయి. నవంబర్ 30న తెలంగాణా ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కంటే ముందే చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారు అన్నది అంతా భావిస్తున్నారు. క్వాష్ పిటిషన్ విషయంలో బాబుకు సానుకూల తీర్పు వస్తే ఇక బాబు పులి అయిపోతారు. ఒకవేళ అలా జరగకపోయినా ఆయనకు సాధారణ బెయిల్ కచ్చితంగా లభిస్తుంది.

ఎలా చూసుకున్నా తొందరలోనే బాబు బయటకు వస్తారు. రాగానే బాబు ఏపీ కంటే ముందు తెలంగాణాలోనే తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తారు అని భావిస్తున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుని ఆయన తెలంగాణా ఎన్నికల బరిలోకి దిగుతారు అని అంటున్నారు. దాదాపుగా ముప్పయి అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆంధ్రా సెటిలర్లు ప్రభావం చూపే స్థాయిలో ఉన్నారు.

దాంతో అక్కడే జనసేన టీడీపీ కూటమి పోటీ చేయడం ద్వారా తన రాజకీయ చాతుర్యాన్ని చూపిస్తాయని అంటున్నారు. ఈ ఓట్లు కనుక కూటమికి పడితే కనుక తెలంగాణా రాజకీయాల్లో టీడీపీ జనసేన నిర్ణయాత్మకమైన శక్తిగా ముఖ్య పాత్ర పోషిస్తాయి.

చంద్రబాబు సైతం దూకుడుగా అగ్రెస్సివ్ గా తెలంగాణా ఎన్నికల్లో పనిచేస్తారు అని అంటున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. రేపటి జాతీయ రాజకీయాలతో పాటు మరో ఆరు నెలలలో జరగబోయే ఏపీ పాలిటిక్స్ లో టీడీపీ చక్రం తిప్పాలన్నా దశ తిరగాలన్నా తెలంగాణా ఎన్నికలు చాలా ముఖ్యమని చంద్రబాబు కచ్చితంగా భావిస్తారు అంటున్నారు.

ఆయన అరెస్ట్ కాక ముందు నుంచే తెలంగాణా ఎన్నికల మీద ఫోకస్ పెట్టి ఉన్నారు. ఇపుడు పొత్తులతో బరిలోకి దిగి ఒక్క దెబ్బకు మూడు నాలుగు పిట్టలు అన్నట్లుగా చాలా మందినే టార్గెట్ చేస్తారు అని అంటున్నారు. ఇక తెలంగాణా ఎన్నికల్లో ఏ పార్టీకైనా పూర్తి మెజారిటీ వచ్చినా టీడీపీ కూటమి విపక్షంలో ఉంటుంది, తాము తెలంగాణాలో గెలిచామని టీడీపీ సేన కూటమి ప్రూవ్ చేసుకుని ఆ విశ్వాసంతో ఏపీ రాజకీయాల్లో అడుగు పెడతాయి.

ఒక వేళ హంగ్ వస్తే టీడీపీ కూటమి గెలుచుకున్న సీట్లు కీలకం అవుతాయని అంటున్నారు. అదే జరిగితే చంద్రబాబు టీడీపీ జాతకం వేరే లెవెల్ లోకి వెళ్తుంది అని అంటున్నారు. వన్స్ తెలంగాణాలో అధికార పాత్ర లోకి మారితే మాత్రం ఏపీ రాజకీయాలను సులువుగా టర్న్ చేయగలమని కూడా భావించే సీన్ ఉంది. 2004 నుంచి తెలంగాణాలో అధికార యోగం లేని టీడీపీకి ఈసారి ఎన్నికలు కీలకం అని అంటున్నారు.

ఇక చంద్రబాబు అరెస్ట్ జైలు జీవితం పట్ల ఒక బలమైన సామాజికవర్గంలో విపరీతమైన సానుభూతితో పాటు కసి కూడా ఉన్నాయని అంటున్నారు. అవన్నీ ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తాయని అంటున్నారు. అందుకే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు అరెస్ట్ మీద సానుభూతి పెద్ద ఎత్తున ఉంటుందని ముందే జోస్యం చెబుతున్నారు. మొత్తానికి చూస్తే బాబు అరెస్ట్ జైలు జీవితం మీద సానుభూతి ఎంత ఉందో తెలంగాణా ఎన్నికలు నిరూపిస్తాయని అంటున్నారు. టీడీపీ భావిస్తున్నట్లుగా సానుభూతి ఉంటే ఇక ఆ పార్టీకి ఏపీలో కూడా కొంత సానుకూలత వచ్చినట్లే.

అదే ఊహించిన విధంగా లేకపోతే మాత్రం ప్లాన్ బీని అమలు చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. సో తెలంగాణా ఎన్నికలు టీడీపీకి అత్యంత ముఖ్యమని అంటున్నారు. కేవలం టీడీపీ మాత్రమే కాదు తెలుగు రాజకీయ పార్టీలు ఏపీలోని అధికార పార్టీ సహా అంతా తెలంగాణా ఎన్నికల్లో టీడీపీకి ఎంత సానుభూతి దక్కుతుంది అన్నది అయితే అంచనా కడతారు అని అంటున్నారు.