Begin typing your search above and press return to search.

తెలివిగా తప్పించుకున్న బీజేపీ...బాబు దొరికిపోయారా ?

అదే ఇపుడు ఆచరణలో జరుగుతోంది. బీజేపీ పొత్తులో టీడీపీ ఏ మేరకు లాభపడింది అన్నది పక్కన పెడితే ప్రభుత్వ పరంగా మాత్రం ఆర్థిక సాయం అనుకున్న స్థాయిలో దక్కడం లేదు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   10 Aug 2024 2:30 AM GMT
తెలివిగా తప్పించుకున్న బీజేపీ...బాబు దొరికిపోయారా ?
X

కేంద్రంలోని బీజేపీలో ఎంతో మంది నాయకులు ఉంటారు. నిరంతరం బీజేపీలో మేధో మధనం జరుగుతుంది. దాని మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్ అయితే పూర్తి స్థాయిలో దిశా నిర్దేశం చేస్తూ ఉంటుంది. ఆరెస్సెస్ లో ఉన్న వారు అంతా తెలివి నిండిన వారు తలలు పడిన వారు. వారు అనేక సబ్జెక్టులలో నిపుణులు. బీజేపీ వంటి రాజకీయ ముఖాన్ని జనంలో ఉంచి రాజకీయంగా సరైన ట్రాక్ లో పెడుతున్న ఆరెస్సెస్ మేధస్సుని తక్కువ అంచనా వేయడం ఎవరి తరమూ కాదు.

బీజేపీ నేతలు జనంలో ఉన్నా లేకపోయినా ఆరెస్సెస్ క్యాడర్ క్షేత్ర స్థాయిలో ఎపుడూ ఉంటుంది. అలా ఫీడ్ బ్యాక్ ని తెచ్చి ఎప్పటికప్పుడు బీజేపీకి ఇస్తుంది. అది డిస్కషన్ పెడుతూంటుంది. అలా బీజేపీకి కోట్లాది మంది జనాలు ఏమి అనుకుంటున్నారు అన్నది తెలుస్తూ ఉంటుంది. అంతే కాదు వివిధ రాష్ట్రాలలో రాజకీయ సామాజిక ఆర్ధిక పరిస్థితుల మీద ఆరెస్సెస్ అధ్యయనాలు ఉంటాయి.

ఇంకో విషయం ఏంటి అంటే ఉచితాలకు ఆరెస్సెస్ బహు దూరం. అదే బీజేపీ ఫిలాసఫీ గా మారింది. ఏపీలో చూస్తే సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ఎన్నికల వేల అనేక హామీలను ఇచ్చేశారు. ఎడా పెడా ఆయన వాటిని జనంలో ప్రచారం చేసేశారు. బాబు ధైర్యం ఏమిటి అంటే కేంద్రంలో బీజేపీ అండ ఉంటుందని. నిజానికి ఏపీ ఆర్థిక పరిస్థితి బాబుకు తెలియంది కాదు అని అంటారు.

అయితే కేంద్రం మద్దతు ఉంటే తాను హామీలను నెరవేర్చగలను అని ఆయన భావించారు. కానీ కూటమి మేనిఫేస్టోకి బీజేపీ ప్రతినిధులు హాజరైనా ఆ మేనిఫేస్టోని ముట్టుకోలేదు. దాంతోనే టీడీపీకి షాక్ కొట్టినట్లు అయింది. ఉచిత హామీలు తమవి కావు తమ నెత్తిన అవి ఎప్పటికి భారం కాకూడదు అని ముందు చూపుతోనే బీజేపీ ఇలా చేసింది అని నాడే అంతా అనుకున్నారు.

అదే ఇపుడు ఆచరణలో జరుగుతోంది. బీజేపీ పొత్తులో టీడీపీ ఏ మేరకు లాభపడింది అన్నది పక్కన పెడితే ప్రభుత్వ పరంగా మాత్రం ఆర్థిక సాయం అనుకున్న స్థాయిలో దక్కడం లేదు అని అంటున్నారు. తెలుగుదేశం హామీలు ఆ పార్టీ ఇష్టం అన్నట్లుగానే బీజేపీ వ్యవహరిస్తోంది అని అంటున్నారు. నిజానికి అమరావతి రాజధానిని నిర్మిస్తామని విభజన చట్టంలో పెట్టినా దానికి కూడా పదేళ్ళ తరువాత రుణం మాత్రమే ఇప్పిస్తున్న కేంద్రం నుంచి ఉదారంగా నిధులను ఆశించడం అంటే అది తప్పే అవుతుంది అని అంటున్నారు.

దాంతో హామీల విషయంలో తెలుగుదేశం పాట్లు ఏవో పడమని కేంద్రం చోద్యం చూస్తోంది అని అంటున్నారు. ఇక మేనిఫేస్టోనే తమ చేతుల్తో ముట్టని బీజేపీ నుంచి కేవలం హామీల కోసం నిధులు అడగడం కూడా టీడీపీకి అయ్యే పని కాదు అని అంటున్నారు. దాంతోనే కిందా మీద ప్రభుత్వ పెద్దలు అవుతున్నారు అని అంటున్నారు. ఒక వైపు రెండు నెలల వ్యవధి గడుస్తోంది. ఒక్క సామాజిక పెన్షన్లు తప్ప మరేమీ హామీని కూటమి నెరవేర్చలేదు. ఏ హామీ ముట్టుకున్నా షాక్ కొడుతుంది. పైగా విధి విధానాల దగ్గర తకరారు వస్తే అనుకున్నంతమంది లబ్దిదారులకు ఇవ్వకపోతే అది కూడా వైసీపీకి ప్లస్ అవుతుంది.

అందుకే కొన్నాళ్ళు వాయిదా వేయడమే మంచింది అని కూటమి పెద్దలు ఉన్నారని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే 2025-26 ఆర్ధిక సంవత్సరంలో కొన్ని పధకాలు అమలు చేయవచ్చు లేకపోతే ఎన్నికలకు రెండేళ్ళ ముందు హామీలు అమలు చేస్తే జనాలకు కూడా గుర్తు ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారుట. మొత్తానికి బీజేపీ హామీల విషయంలో తప్పించుకుందని టీడీపీ తో పాటు చంద్రబాబు దొరికిపోయారు అని అంటున్నారు. మరో మిత్ర పక్షం జనసేన కూడా ఈ విషయంలో కేంద్రం వద్ద తన పలుకుబడిని వాడేందుకు సిద్ధంగా ఉందా అంటే జవాబు అయితే లేదు అంటున్నారు.