సూపర్ 6 కాదు 'సూపర్ -3' సక్సెస్...!
ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ -6 పథకాల అమలు వ్యవహారం.. ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది
By: Tupaki Desk | 1 Aug 2024 8:30 AM GMTఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ -6 పథకాల అమలు వ్యవహారం.. ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. అమలు చేసే విషయంపై నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. జగన్ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేశారని.. సో.. ఇప్పటికిప్పుడు వాటిని అమలు చేయలేమని.. అన్న విధంగానే చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అప్పులు ఉన్న విషయం ముందుగా తెలియదా!? అంటూ.. కొందరు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు.. కమ్యూనిస్టులు కూడా సూపర్ -6 పథకాలను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. వీరు ఉద్యమాలు చేసినా చేయకపోయినా.. మీడియా మీటింగుల్లో మాత్రం దంచి కొడుతున్నారు. దీంతో సర్కారు ఇప్పుడు అంతర్మథనంలో పడిపోయింది. సూపర్ -6 ను ఎలా అమలు చేయాలన్న విషయంపై ఆలోచన చేస్తోంది. దీనిలో భాగంగా.. ప్రభుత్వంపై ఆర్థిక భారపడని సూపర్ -3 పథకాలను అమలు చేసేదిశగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
సూపర్ -6 పథకాలు చూస్తే..
1) పింఛన్లను పెంచడం, 2) తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే ప్రతిచిన్నారికీ రూ.15000 చొప్పున ఇవ్వడం. 3) నిరుద్యోగ భృతి కింద రూ.3000 ఇవ్వడం. 4) మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. 5) రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద ఏటా రూ.20000. 6) ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన యువతుల నుంచి మహిళలకు రూ.1500 చొప్పున నెల నెలా ఇవ్వడం. ఈ ఆరు పథకాలను చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
ఇప్పుడు ఏం చేస్తారు?
సూపర్ -6ను తాము అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి విషయంలో కొంత ఆలోచన పడినట్టు చెప్పుకొచ్చారు. భయం వేస్తోందనికూడా అన్నారు. అయినా. వీటిని అమలు చేసి తీరాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు వ్యతిరేకత అనే ఆయుధం ఇవ్వకుండా.. ముందుగా మూడు పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. వీటిలో 1) పింఛన్లను పెంచడం. దీనిని అమలు చేస్తున్నారు. 2) ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం.
దీనివల్ల ఇప్పటికిప్పుడు సర్కారుపై వేల కోట్ల భారం పడదు. నెలకు 250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. దీనిని పెద్ద ఇబ్బందిగా భావించడం లేదు. 3) సూపర్ సిక్స్‌లో లేని.. అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం. వీటిని ఆగస్టు 15న రాష్ట్రంలో 100 క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ద్వారా.. వ్యతిరేకత పెరగకుండా చూడాలని నిర్ణయించారు.