Begin typing your search above and press return to search.

బాబు ఈసారి ఏ 3... సీఐడీ రెడీ !

దాంతో ఈ కేసుకు సంబంధించి ఏ వన్ గా ఐ ఎస్ నరేష్ ని, ఏ 2గా ఆనాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రని పెడుతూ ఏత్రీగా చంద్రబాబు మీద కేసు నమోదు చేశారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:51 AM GMT
బాబు ఈసారి ఏ 3... సీఐడీ రెడీ  !
X

టీడీపీ అధినేత చంద్రబాబు ఏ 37 గా ఉన్న కేసులోనే యాభై రోజుల పాటు జైలులో ఉంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబు ఇబ్బంది పడుతున్న నేపధ్యం ఉంది. ఇపుడు దానికి అదనంగా మరో కేసు రెడీ అవుతోంది. దీనికి ఏపీ సీఐడీ నమోదు చేసింది.

లిక్కర్ స్కాం అంటూ బాబుని ఏ 3గా పేర్కొంటూ ఈ కేసుని సిద్ధం చేశారు. ఇక ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద ఈ కేసులో బాబు మీద కేసు పెట్టినట్లుగా సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే కేసు విషయం మీద బాబు మీద నమోదు చేసిన కేసు గురించి ఏసీపీ కోర్టుకు తెలిపారు. దీని మీద విచారణ జరపాలని కూడా సీఐడీ వేసిన పిటిషన్ కి ఏసీబీ కోర్టు అనుమతి లభించింది.

దాంతో ఇపుడు అది ఎఫ్ఐఆర్ నంబర్ - 18/2023తో కేసు నమోదైంది. దాంతో బాబు చుట్టూ మరో కొత్త కేసు అల్లుకుంది. ఇంతకీ ఆ కేసు ఏంటి దాని వివరాలు ఏంటి అంటే చంద్రబాబు సీఎం గా ఉన్న టైం లో తన ప్రభుత్వం హయాంలో తనకు అనుకూలంగా ఉన్న రెండు బ్రేవరేజ్ కంపెనీలకు మరో మూడు డిస్టిలరీల నిర్వాహకులకు లబ్ది చేకూర్చడానికి ఏకంగా మద్యం పాలసీన మార్చేసారు అన్నదే సీఐడీ ప్రధాన ఆరోపణ.

దాంతో ఈ కేసుకు సంబంధించి ఏ వన్ గా ఐ ఎస్ నరేష్ ని, ఏ 2గా ఆనాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రని పెడుతూ ఏత్రీగా చంద్రబాబు మీద కేసు నమోదు చేశారు. ఇక బాబు హయాంలో ఆ విధంగా లబ్ది పొందిన వారు ఎవరంటే నంద్యాల మాజీ ఎంపీ అయిన ఎస్పీవై రెడ్డికి చెందిన బ్రేవరేజ్ అలాగే మరొక బ్రేవరేజి అని అంటున్నారు. వీటితో పాటుగా మూడు డిస్టిలరీ నిర్వాహకులు ఉన్నారన్నది సీబీఐ అభియోగపత్రంలో ఉంది.

ఇలా చంద్రబాబు అయిదు మద్యం సంస్థలకు భరీగా లబ్ది చేకూర్చేలా 2012 నాటి ఎక్సైజ్ పాలసీ మార్చేశారని, అనుమతులు మంజూరు చేశారన్నది సీఐడీ పెట్టిన కేసులో పేర్కొన్నారు. అంతే కాదు ఇదే కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని కూడా సీఐడీ చెబుతోంది. అదెలా అంటే 2012 నుంచి 2015 దాకా మద్యం ద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఏటా వచ్చే ఆదాయం 2,900 కోట్ల రూపాయలుగా ఉంది.

ఇక మద్యం పాలసీ మార్చేశాక ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని అంటున్నారు. అలా టర్నోవర్ మీద ఎనిమిది శాతం వ్యాట్ ని ఆరు శాతం పన్నులను కూడా తొలగించిందని సీఐడీ ఆరోపిస్తోంది. నిజానికి పన్నులను ఆరు శాతం నుంచి పది శాతం పెంచాలని కమిటీ చేసిన సిఫార్సులను కూడా పక్కన పెట్టేసింది అని పేర్కొంది. ఇలా ఈ మొత్తం లిక్కర్ స్కాం వెనక క్విడ్ ప్రోకో ఉందని సీఐడీ అనుమానిస్తోంది. ఈ కేసులో కూడా బాబుని అరెస్ట్ చేయవచ్చు అని అంటున్నారు. ఎట్టకేలకు స్కిల్ స్కాం లో బాబు బెయిల్ మీదకు వస్తారనుకుంటే మరో కేసు రెడీ అయిందని అంటున్నారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.