లోక్ సభకు బాబు...రాజ్యసభకు జగన్ !
గతంలో జగన్ కి మద్దతుగా ఉన్నా చంద్రబాబు విషయంలోనూ సీరియస్ యాక్షన్ కి దిగలేదు ఇపుడు కూడా జగన్ విషయంలో అదే విధానం అనుసరించవచ్చు అని అంటున్నారు.
By: Tupaki Desk | 18 July 2024 3:00 AM GMTఅదేంటి ఈ ఇద్దరూ ఎంపీలుగా వెళ్తున్నారా అని అనుకోవద్దు. లోక్ సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. దాంతో 16 ఎంపీలుఇ ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ఎంపీల మద్దతు ఆక్సిజన్ గా మారింది. అది టీడీపీకి భారీ పొలిటికల్ అడ్వాంటేజ్ గా ఉంది.
ఈసారి కేంద్రంలో టీడీపీ మాట చెల్లుబాటు అవుతుందని ఒక విధంగా చక్రధారి చంద్రబాబు అని అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. అయితే అదే సమయంలో రాజ్యసభలో బీజేపీకి భారీ కొరత వచ్చింది. దాంతో అక్కడ బీజేపీకి సీట్లు భారీగా తగ్గిపోయాయి. మరో ఇరవై ఖాళీలలో భర్తీ జరిగినా వాటిలో బీజేపీ కొన్ని గెలిచినా ఇంకా మెజారిటీకి చేరుకోవడానికి వైసీపీ మద్దతు అవసరం అని లెక్కలు చెబుతున్నాయి.
మరో వైపు అన్నా డీఎంకేకు నాలుగు ఎంపీలు ఉన్నాయి. ఇక బిజీ జనతాదళ్ కి కూడా ఎంపీలు ఉన్నారు. కానీ ఈ రెండు పార్టీల నుంచి మద్దతు దక్కదు అని అంటున్నారు. దాంతో రాజ్యసభలో జగన్ అవసరం నూరు పాళ్ళూ ఉంటుందని అంటున్నారు. రాజ్యసభలో 11 మంది వైసీపీకి ఉన్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి ఏ ఒక్కరూ లేరు.
ఇందులో కనీసం నలుగురు అయినా టీడీపీ వైపు చూస్తున్నారు అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వారిని కనుక టీడీపీ తీసుకుంటే మిగిలిన ఏడుగురు మద్దతుని వైసీపీ ఇచ్చేందుకు నిరాకరించవచ్చు అని అంటున్నారు. దాంతో ఫిరాయింపుల విషయంలో ఏమి జరుగుతుంది అన్న చర్చ ఉంది.
మరో వైపు చూస్తే కేంద్రంలోకి బీజేపీకి ఇలా ఏపీలోని రెందు కీలక పార్టీల మద్దతు ఒకే సమయంలో అవసరం పడడం రాజకీయ చిత్రంగానే చూస్తున్నారు. ఏపీలో చూస్తే వైసీపీ ఎన్డీయే కూటమికి ప్రత్యర్థిగా ఉంది. ఢిల్లీలోనూ అదే రిపీట్ కావాలి. కానీ స్పీకర్ ఎన్నికల్లో అవుట్ రేట్ గా వైసీపీ మద్దతు ఇచ్చింది.
దాంతో కేంద్రంలోని బీజేపీతో దోస్తీ చేయడానికి వైసీపీ ఆసక్తిని చూపిస్తోంది అని అంటున్నారు. ఇలా అయాచితంగా వస్తున్న మద్దతుని దక్కించుకోవడానికి బీజేపీ పెద్దలకు బాగానే ఉంటుంది అని అంటున్నారు. అయితే ఇక్కడే టీడీపీ విభేదిస్తోంది అని అంటున్నారు. కూటమిలో మిత్రులుగా ఉంటూ వైసీపీ మద్దతుని ఎలా తీసుకుంటారు అన్నదే టీడీపీ పెద్దల ఆలోచన అని అంటున్నారు.
అయితే రాజ్యసభలో మద్దతుకు బీజేపీకి ఇంతకంటే వేరే మార్గం లేదు. దానిని అనుకూలంగా మార్చుకుని ఏపీలో కూటమి నేతలు జోరు చేయకుండా కళ్లెం వేయడానికి వైసీపీ ఎటూ వ్యూహ రచన చేస్తుంది. మరి ఇంతటి భారీ మెజారిటీతో గెలిచిన తరువాత వైసీపీ తప్పులను ఎండగడుతూ చర్యలు తీసుకోకపోతే ఎలా అన్నదే మరో చర్చ.
అయితే బీజేపీ మాత్రం ఈ విషయంలో ఎలా వ్యవహరించబోతోంది అన్నది ఆసక్తిగా మారింది. అటు లోక్ సభలో టీడీపీతో ఉంటూ రాజ్యసభలో వైసీపీ మద్దతు తీసుకోవడం మీద బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది చూడాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ ఏపీ రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ తద్వారా తన రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటుందని అంటున్నారు.
గతంలో జగన్ కి మద్దతుగా ఉన్నా చంద్రబాబు విషయంలోనూ సీరియస్ యాక్షన్ కి దిగలేదు ఇపుడు కూడా జగన్ విషయంలో అదే విధానం అనుసరించవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు నేతలూ రెండు పార్టీలూ చెరో వైపు ఉంటేనే ఏపీ రాజకీయాల్లో రాజకీయ త్రాస్ బ్యాలెన్స్ గా ఉంటుంది.
ఒకరిని పక్కన పెట్టేస్తే అది రెండవవారికి ఏకపక్షం అవుతుంది. అపుడు బీజేపీ పాత్ర కూడా కీలకంగా ఉండకపోవచ్చు. అందుకే ప్రత్యర్ధులను ఇద్దరినీ అలా ఎదురుబొదురుగా ఉంచి తన వ్యూహాలు అమలు చేయడమే బీజేపీ మార్క్ పాలిటిక్స్ అని అంటున్నారు. సో చూడాలి మరి బడ్జెట్ సెషన్ లో బీజేపీ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుస్తుంది అని అంటున్నారు.