పోలవరంలో చంద్రబాబు.. ఏమన్నారంటే!
ముందుగా ఉండవల్లి నుంచి పోలవారినికి హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి ప్రాజెక్టు పరిసరాలను ఏరియల్ సర్వే చేశారు.
By: Tupaki Desk | 17 Jun 2024 9:26 AM GMTఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం పర్యటించారు. సాగు, తాగు నీటి ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు మధ్యలోనే నిలిచిపోయిన నేపథ్యంలో ఏయే పనులు ఎక్కడ నిలిచిపోయాయన్న విషయాలను ఆయన అధికారు లను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఉండవల్లి నుంచి పోలవారినికి హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి ప్రాజెక్టు పరిసరాలను ఏరియల్ సర్వే చేశారు.
అనంతరం.. క్షేత్రస్థాయిలో పర్యటించి.. పోలవరం పరిస్థితిని సంబంధిత అధికారులను అడిగి తెలుసు కున్నారు. అనంతరం.. ప్రాజెక్టు పనులను ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశంపై ఉన్నతా ధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రతి విషయాన్నీ కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మ్యాప్ ద్వారా ప్రాజెక్టు పరిస్థితిని వివరించారు. అనంతరం.. చంద్రబాబు అధికారులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అయిన పనులను పూర్తి నివేదిక రూపంలో ఇవ్వాలన్నారు.
పనుల విషయంలో ఎక్కడా రాజీ పడడానికి వీల్లేదని చెప్పారు. వరదలకు కొట్టుకుపోయిన ట్యాంక్ బండ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎక్కడ లోపం జరిగిందో తనకు రెండు వారాల్లో ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు ఈ పనిపైనే ఉండాలని ఆదేశించారు. పోలవరాన్ని ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యంగా భావిస్తున్నట్టు సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, ఈ పర్యటనలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.