Begin typing your search above and press return to search.

జగన్ కోసం బాబు వెయిటింగ్ అక్కడ....!?

అటు నుంచి యాక్షన్ ఇటు నుంచి రియాక్షన్ లేకపోతే పొలిటికల్ గా సౌండ్ ఏముంటుంది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 3:00 AM GMT
జగన్ కోసం బాబు వెయిటింగ్ అక్కడ....!?
X

జగన్ కోసం బాబు వెయిటింగ్ ఏంటి. ఎందుకు అలా అని అనుకుంటున్నారా. అదే తమాషా మరి. రాజకీయాలు పరస్పర ప్రేరితాలు. అటు నుంచి యాక్షన్ ఇటు నుంచి రియాక్షన్ లేకపోతే పొలిటికల్ గా సౌండ్ ఏముంటుంది. అందుకే జగన్ వైపు బాబు చూపు ఉంది అని అంటున్నారు.

చంద్రబాబు ఇప్పటప్పట్లో తన అభ్యర్ధుల జాబితాను ప్రకటించరు అని అంటున్నారు. జగన్ అభ్యర్ధుల లిస్ట్ మొత్తం బయటకు వచ్చాక ఆ పార్టీలో టికెట్లు రాని వారు ఆశించి భంగపడిన వారిని వచ్చిన వారిని వచ్చినట్లే పార్టీలో చేర్చుకునే ప్లాన్ లో బాబు ఉన్నారని అంటున్నారు.

ఇప్పటికే గోదావారి జిల్లాలలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అలాగే నెల్లూరులో కూడా వైసీపీలో ముగ్గురుకి టికెట్లు రావని అంటున్నారు. ఇలా జిల్లాలో ముగ్గురేసి వంతున లిస్ట్ ఉంది. ఈ వివరాలు అన్నీ టీడీపీ సేకరిస్తోంది.

అలా ఎమ్మెల్యే టికెట్లు రాని వారిని తమ పార్టీలో చేర్చుకుని ఏపీ రాజకీయాన్ని టీడీపీకి పాజిటివ్ గా తిప్పాలని చంద్రబాబు ఆలోచన అంటున్నారు. ఇక ఇలా వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వకుండా హామీలు మాత్రమే బాబు ఇవ్వాలని అనుకుంటున్నారుట. వారి సేవలను పార్టీకి వాడుకుని అధికారంలోకి వచ్చిన తరువాతనే వారికి సముచిత స్థానం అని చెప్పబోతున్నారుట.

అలా ఒప్పుకున్న వారికే పార్టీలో ప్రవేశం అని అంటున్నారుట. అయితే దీనికి కొంతమంది అంగీకరించి సైకిలెక్కడానికి చూస్తున్నారుట. మరికొందరు మాత్రం సంశయిస్తున్నారుట. మరి వారిని కూడా దారికి తెచ్చుకోవడానికి బాబు ఆలోచిస్తున్నారుట.

ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ మాత్రం తమకు ఇబ్బంది ఉన్న చోట అభ్యర్ధులను మార్చుకుంటూ పోతోంది. వారి వల్ల ఎంత నష్టం ఉంటుందని అంచనా కట్టి మరీ దాన్ని అధిగమించే ప్లాన్ కూడా రెడీ చేసుకుని ముందుకు సాగుతోంది.

ఎన్నికలకు రెండు నెలల ముందు అభ్యర్ధులను ప్రకటించడం ద్వారా విపక్షాల మీద పై చేయి సాధించాలని వైసీపీ చూస్తోంది. ఈ విధంగా జనంలోకి ముందు తమ పార్టీ అభ్యర్థులు వెళ్తే గెలుపు అవకాశాలు ఇంకా బాగా పెరుగుతాయని వైసీపీ ఆలోచిస్తోంది.

ఇక తెలుగుదేశం పార్టీ అయితే అభ్యర్ధులను మొదట ఏడాది ముందు ప్రకటిస్తామని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆరు నెలల ముందు అన్నారు, అది కాస్తా మూడు నెలల ముందు అన్నారు. ఇపుడు చూస్తే తొందరేముంది నోటిఫికేషన్ వచ్చిన తరువాతనే అభ్యర్ధుల జాబితా అంటున్నారని తెలుస్తోంది.

అంటే చంద్రబాబు ఓల్డ్ ట్రెండ్ నే ఫాలో అవుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోందిట. అదే జరిగితే ఎన్నికల ముందు టికెట్లు తెచ్చుకుని ప్రచారానికి సమయం ఎక్కడ ఉంటుంది అన్నది తమ్ముళ్ల ఆవేదనగా ఉంది. ఇక జనసేంతో పొత్తులు ఉన్నాయి. బీజేపీ వైపు చూపు ఉంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంటున్నారు. ఇపుడు వైసీపీ నుంచి జంపింగ్ ఎమ్మెల్యేల కోసం చూస్తున్నారు.

ఇలా టీడీపీ అభ్యర్ధుల జాబితాను సత్వరం ప్రకటించకపోతే మొదటికే మోసం వస్తుందా అన్నదే పసుపు శిబిరంలో మెదులుతున్న అతి పెద్ద సందేహంగా ఉందిట.