Begin typing your search above and press return to search.

తమ్ముళ్ల అనుమానాలకు చెక్ పెట్టేలా చంద్రబాబు సమాధానం

వైద్యులు చంద్రబాబు పక్కనే ఉన్నారా? అని న్యాయాధికారి ప్రశ్నించగా స్పందించిన ఆయన.. ఆన్ లైన్ లో తనను వైద్యులు పరీక్షించినట్లుగా పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   20 Oct 2023 9:30 AM GMT
తమ్ముళ్ల అనుమానాలకు చెక్ పెట్టేలా చంద్రబాబు సమాధానం
X

స్కిల్ స్కాం ఆరోపణల నేపథ్యంలో రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ విపక్ష నేత చంద్రబాబు ఆరోగ్యంపై బోలెడన్ని సందేహాలు నెలకొన్నాయి. ఆయనకు సరైన రీతిలో వైద్యాన్ని అందించట్లేదన్న ఆరోపణలతో పాటు.. ఆయన ఆరోగ్యం అంతకంతకూ తగ్గుతుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. అందులో నిజం ఎంత? అన్న విషయాన్ని ఎవరూ ధ్రువీకరించట్లేదు. ఇలాంటి వేళ.. అనూహ్యంగా చంద్రబాబు నోటి నుంచి వచ్చిన సమాధానం.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అర్థమయ్యేలా చేయటమే కాదు.. వైద్యులు తాము చేయాల్సిన పనిని సక్రమంగా.. ఎవరి ఒత్తిడి లేకుండా చేశారన్న విషయం అర్థమవుతుంది.

స్కిల్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు కూడా నమోదు కావటం.. దీనికి ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టు ఎదుట ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఏసీబీ కోర్టు ఎదుట ఆన్ లైన్ లో హాజరైన చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించారు. దీనికి బాబు బదులిస్తూ.. అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అనంతరం న్యాయాధికారి హిమబిందు మాట్లాడుతూ.. వైద్యులు తమ వైద్య నివేదికల్ని కోర్టుకు పంపుతున్నారని.. వాటిని తాను చూస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో సదరు నివేదికల్ని మీకు అందిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన చంద్రబాబు.. వైద్య నివేదికలు తనకు ఇస్తున్నారని చెప్పారు. అంటే.. హెల్త్ చెకప్ కు సంబంధించిన టెస్టు రిపోర్టులను చంద్రబాబుకు అందజేస్తున్నారంటే.. వాటిని తన ములాఖాత్ ల సందర్భంగా షేర్ చేసుకునే వీలుంది. అంటే.. చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న సందేహాల్లో బేస్ లేదని చెప్పాలి. ఎందుకంటే.. సదరు రిపోర్టులను బాబు కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునే వీలుందన్నది మర్చిపోకూడదు.

వైద్యులు చంద్రబాబు పక్కనే ఉన్నారా? అని న్యాయాధికారి ప్రశ్నించగా స్పందించిన ఆయన.. ఆన్ లైన్ లో తనను వైద్యులు పరీక్షించినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. తెలుగు తమ్ముళ్లుపలువురు ఇటీవల కాలంలో అదే పనిగా చంద్రబాబు అనారోగ్యంపై వినిపిస్తున్న వాదనల్లో పెద్ద పస లేదన్న విషయం తాజా ఉదంతంతో అర్థమైందని చెప్పాలి.