ప్రముఖ నటుడు చంద్రమోహన్ హఠాన్మరణం
ప్రముఖ నటుడు చంద్రమోహన్ (82) శనివారం ఉదయం మృతి చెందారు.
By: Tupaki Desk | 11 Nov 2023 5:18 AM GMTప్రముఖ నటుడు చంద్రమోహన్ (82) శనివారం (నవంబర్ 11) ఉదయం మృతి చెందారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న చంద్రమోహన్ అపోలోలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆయన మృతి పట్ల సినీ..రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. సీనియర్ నటుడు మురళీ మోహన్ ..చంద్రమోహన్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. హీరోగా...కమెడియన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసారు. 55 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు.
1966 లో `రంగుల రాట్నం` సినిమాతో తెరంగేట్రం చేసారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. మొత్తం 900లకు పైగా సినిమాల్లో నటించారు. హీరోగా 175 సినిమాల్లో నటించారు.1945 మే 23న కృష్ణా జిల్లా పమిడి ముక్కలో గ్రామంలో జన్మించారు. 1987 లో `చందమామ రావే` సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా తొలి నంది అవార్డు అందుకున్నారు.
ఆ తర్వాత 2005లో `అతనొక్కడే` సినిమాలో నటనకు గానూ మరో నంది సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కె. విశ్వనాద్ కాంబినేషన్ లో ఆయన చేసిన సినిమాలు చంద్రమో హన్ కి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి. నాటి తరం నటీనటులతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ముఖ్యంగా శోభన్ బాబు..మురళీ మోహన్ లాంటి నటీనటులతో ఆయన స్నేహం ఎంతో ప్రత్యేకమైనది.