Begin typing your search above and press return to search.

చంద్రయన్ 3: జాబిల్లిని చేరాలంటే40 రోజులు ఎందుకు?

రాకెట్ ద్వారా భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడుతోంది

By:  Tupaki Desk   |   15 July 2023 3:55 AM GMT
చంద్రయన్ 3: జాబిల్లిని చేరాలంటే40 రోజులు ఎందుకు?
X

భూమి నుంచి 3.84 లక్షల కి.మీ దూరంలో ఉన్న చంద్రుడి వద్దకు రోవర్లు చేరుకోవడానికి అమెరికాకు నాలుగు రోజులు పడితే.. రష్యాకు ఒకట్టిన్నర రోజే పట్టింది. మరి ఇస్రోకు మాత్రం సుమారు 40 రోజుల సమయం ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఈ సందేహం ఆసక్తికరంగా మారింది.

అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలు ఎంతో ప్రగతి సాధించినా.. చంద్రుడి అన్వేషణ ఓ సవాలుగానే ఉంటుంది. జాబిల్లి రహస్యలు అంత సులువుగా అంటుచిక్కడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో... దశాబ్దాల క్రితమే జాబిల్లిపై అమెరికా కాలుమోపగా.. తర్వాత రష్యా చైనాలు తమ రోవర్లను అక్కడ సురక్షితంగా దించగలిగాయి. తాజాగా భారత్ చంద్రయాన్-3ని ప్రయోగించింది.

అయితే ఆదేశాలేవీ చంద్రుడిని చేరుకోవడానికి 40రోజుల వ్యవధి తీసుకోలేదు. కానీ.... భారత్ మాత్రం నెలకు పైగా సమయం తీసుకుంటుంది. అయితే... భూమి నుంచి చంద్రుడి మీదకి నేరుగా వెళ్తే తక్కువ సమయంలోనే చేరుకోవచ్చంట. అందుకోసం శక్తిమంతమైన రాకెట్ ను వినియోగించాల్సి ఉంటుందని అంటున్నారు.

ఇదే సమయంలో ఇందుకోసం భారీ రాకెట్ ను వినియోగించాల్సి ఉంటుంది. అందుకోసం భారీ మొత్తంలో ఇంధనం అవసరం అవుతుంది. భారీ రాకెట్ల ప్రయోగం.. అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. అయితే చంద్రయాన్ మాత్రం ఇప్పుడు అంత ఖర్చు అవసరం లేదని భావించిందని అంటున్నారు.

అవును... ఇస్రో కేవలం రూ.615 కోట్లతోనే చంద్రయాన్- 3 ప్రాజెక్టుకు చేపట్టింది. వేగంగా వెళ్లాల్సిన అవసరం లేకపోవడం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుని దృష్టిలో ఉంచుకొని ఇస్రో.. భిన్న మార్గాన్ని ఎంచుకొందని అంటున్నారు. నేరుగా చంద్రుడిని చేరుకోకుండ... భూమి గురుత్వాకర్షణ సాయంతో చంద్రుడివైపు పయనించే విధానాన్ని అనుసరిస్తోందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... తొలుత చంద్రయాన్-3ని.. రాకెట్ ద్వారా భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడుతోంది. ఇలా భూమి చుట్టూ 24 రోజులపాటు చక్కర్లు కొడుతూ క్రమంగా తన కక్ష్యను పెంచుకుంటూపోతుంది. అలా చివరకు చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి చేరుకుంటుంది. అందువల్లే ఈ ప్రక్రియకు దాదాపు 40రోజుల సమయం పడుతోందని అంటున్నారు.

కాగా... 1969 జులై 16న అమెరికా చంద్రుడిపైకి పంపిన "అపోలో - 11" ప్రయోగానికి భారీ రాకెట్ ను వినియోగించింది. రాకెట్ ఎత్తు ఏకంగా 363 అడుగులు.. కానీ చంద్రయాన్-3 రాకెట్ ఎత్తు 142 అడుగులు మాత్రమే.

ఇదే సమయంలో... "అపోలో - 11" రాకెట్.. నాలుగు రోజుల్లో చంద్రుడి వద్దకు చేరుకుంటే.. అంతకుముందు వెళ్లిన "అపోలో- 8" కేవలం 69 గంటల్లోనే ఈ పని పూర్తి చేసింది. ఇక 1959లో రష్యా చేపట్టిన లూనా-2 వ్యోమనౌక కేవలం 34 గంటల్లో చంద్రుడిని చేరుకుందని తెలుస్తుంది.

అయితే 1964-73 మధ్యకాలంలో అమెరికా తన ఒక్కో ప్రాజెక్టుకు సుమారు 185 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో... ఖర్చును దృష్టిలో పెట్టుకుని ఇస్రో ఇలా తక్కువ ఖర్చుతో లాంగ్ జర్నీ కి ప్లాన్ చేసిందన్నమాట!