Begin typing your search above and press return to search.

జాబిల్లి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు.. మీకు తెలుసా?

దీనివల్ల భూ భ్రమణ శక్తిలో మార్పు వస్తుంది. భూమి తిరిగే వేగం కూడా తగ్గుతుంది.

By:  Tupaki Desk   |   23 Aug 2023 12:56 PM GMT
జాబిల్లి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు.. మీకు తెలుసా?
X

గతంలో చిన్నపిల్లలకు అన్నం తినిపించడానికి ఒక ఆటవస్తువుగా, ఒక సరదా వ్యవహరంగా, ఆహాదకర విషయంగా ఉన్న చందమామపైకి కాలక్రమంలో అనేక దేశాలు మానవ రహిత, మానవ సహిత వ్యోమనౌకలను పంపి పరిశోధనలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ కూడా చంద్రయాన్-3 ద్వారా చంద్రుని అన్వేషణలో పడింది.

ఈ క్రమంలో గతంలో చిన్నపిల్లలకు కథావస్తువుగా ఉన్న చందమామ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!

చంద్రుడు ఎలా ఉంటాడు? అదేమి ప్రశ్న? పున్నమి నాటి చంద్రుడు బంతిలాగా గుండ్రంగా ఉంటాడు. అయితే వాస్తవానికి చంద్రుడు గుండ్రంగా ఉండదు! చంద్రుడి ఆకారం ఓవల్ షేప్ అంటే గుడ్డు ఆకారంలో ఉంటుంది.

ఈ ఆకారం వల్ల భూమి మీద నుంచి చంద్రుడిని పూర్తిగా చూడలేము. ఫలితంగా చంద్రుడిలో గరిష్టంగా 59% ప్రాంతాన్ని మాత్రమే చూడగలం. మిగతా 41% చంద్రుడు మనకు కనిపించడు. ఇదే క్రమంలో ఆ 41% ప్రాంతంలో ఉండి చూస్తే మనకు భూమి కనిపించదు.

ఈ క్రమంలో 1960 తర్వాత చంద్రుడి మీదకు మానవ సహిత వ్యోమనౌకలను పంపించడం సాధ్యమైంది. చందమామ ఉపరితలంలపై అక్కడక్కడా గుంటలు ఉన్నట్లు చంద్రుడిని దగ్గరగా తీసిన ఫొటోలలో కనిపిస్తాయి. వీటిని క్రేటర్స్ అంటారు.

ఈ క్రమంలో తాజాగా చంద్రయాన్ - 3 తీసిన ఫోటోలను ఇస్రో విడుదల చందమామ ఉపరితలంపై అక్కడక్కడా గుంటలు ఉన్నట్లు స్పష్టంగా కనిపించిన సంగతి తెలిసిందే. వీటిని క్రేటర్స్ (బిలాలు) అంటారు. ఇవి సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల కిందట, కొన్ని ఖగోళ వస్తువులు చంద్రుడిని ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ క్రేటర్స్ (బిలాలు)కు ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ పేర్లు పెడుతుంది. ఇందులో భాగంగా ఎక్కువగా చంద్రుని మీద ఉన్న క్రేటర్స్‌ కు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, కళాకారులు, అన్వేషకుల పేర్లు పెట్టారు. ఈ క్రమంలో చంద్రుడి మీద కనిపించే సముద్ర ప్రాంతానికి మేయర్ మోస్కోవిన్స్ (మాస్కో సముద్రం) అని పేరు పెట్టారు.

చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, దానిని పెరిజీ అంటారు. ఈ సమయంలో సముద్రాలలలో అలల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల భూ భ్రమణ శక్తిలో మార్పు వస్తుంది. భూమి తిరిగే వేగం కూడా తగ్గుతుంది.

ఇక చంద్రకాంతి విషయానికొస్తే... భూమి మీదకు వచ్చే సూర్యకాంతి పౌర్ణమి నాటి చంద్రుడి కాంతి కన్నా 14 రెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. నిజంగా మనం సూర్యకాంతికి సమానమైన కాంతిని చంద్రుడి నుంచి పొందాలంటే.. ఇప్పుడున్న చంద్రుడిలాంటి చంద్రుళ్లు 3,98,110 అవసరమవుతాయి!

ఈ క్రమంలో తాజాగా చంద్రయాన్-3 చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం చాలామందికి తెలియని, ఒక రహస్య ప్రాంతంగా పరిగణిస్తారు.