Begin typing your search above and press return to search.

ఆ సమయంలో జాబిల్లిని చూశారా... తప్పక చూడాల్సిన వీడియో ఇది!

ఈ క్రమంలో చంద్రయాన్‌-3 విక్రమ్ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై ఇప్పటికే అన్వేషణ ప్రారంభించింది

By:  Tupaki Desk   |   25 Aug 2023 6:49 AM GMT
ఆ సమయంలో జాబిల్లిని చూశారా... తప్పక చూడాల్సిన వీడియో ఇది!
X

కోట్ల మంది భారతీయుల కళ్లల్లో ఆనందాన్ని నింపి.. ప్రపంచ దేశాల ముందు కాలర్ ఎగరేసుకునేలా చేసిన చంద్రయాన్ - 3 రికార్డ్ సృషించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఏ దేశం అడుగుపెట్టని చోట చంద్రయాన్ - 3 అడుగు పెట్టింది. దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌ తో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో చంద్రయాన్‌-3 విక్రమ్ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై ఇప్పటికే అన్వేషణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇస్రో దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. చంద్రయాన్‌ - 3 ల్యాండర్‌ జాబిలిపై దిగుతుండగా దానికి అమర్చిన కెమెరాలో రికార్డు అయిన వీడియోను షేర్‌ చేసింది.

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ దిగడానికి కొన్ని కిలోమీటర్ల ముందు మొదలైన ఈ వీడియో.. జాబిల్లి అడుగు పెట్టేవరకు రికార్డయింది. ఈ క్రమంలో ఇప్పటివరకూ ప్రపంచం ఎన్నడూ చూడని జాబిలి చిత్రాలను బ్లాక్ & వైట్ లో చూపించిన ఇస్రో... కలర్ ఫుల్ వీడియోను తాజాగా షేర్ చేసింది.

అవును... "విక్రమ్ అడుగుపెట్టడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ కెమెరా చంద్రుడి ఫోటోలను ఎలా క్యాప్చర్‌ చేసిందో చూడండి" అంటూ 2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న వీడియోను తాజాగా షేర్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారుతుంది. రెండు కళ్లూ చాలడం లేదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో ఈ 2 నిమిషాల 17 సెకన్ల వీడియో కంటే ముందు మరొక అద్భుతమైన వీడియోను విడుదల చేసింది ఇస్రో. ఇందులో భాగంగా... విక్రం ల్యాండర్ లో ఉన్న ఎలా బయటకు వచ్చిందో చూపే వీడియో అది. దీని నిడివి 30 సెకన్లు!

ఇదే సమయంలో... అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ ను సుసాధ్యం చేసిన తొలిదేశంగా భారత్‌ నిలవడాన్ని కొనియాడుతూ అమెరికా సహా అనేక దేశాల ప్రధాన పత్రికలన్నీ పతాక శీర్షికలతో ప్రత్యేక కథనాలు వెలువరించాయి.

కాగా, 2019 సెప్టెంబరులో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ - 2 చివరి నిమిషంలో విఫలం కాగా.. దాని ఆర్బిటన్ చాలా సమాచారాన్ని, ఫొటోలను పంపించిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగానే పట్టుదలతో మరోసారి ఇస్రో శాస్త్రవేత్తలు పకడ్బందీ ఏర్పాట్లతో చంద్రయాన్ - 3 ని చేపట్టారు. కేవలం 4 ఏళ్ల వ్యవధిలోనే చంద్రయాన్ - 3 ప్రయోగాన్ని చేపట్టి విజయవంతం అయ్యారు.