ఈసారి అంతకు మించి... చంద్రయాన్-4 ఎప్పుడంటే...?
2026లో చంద్రయాన్-4 ఉంటుందనీ.. దీనికి జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ.. మన ఇస్రోతో చేతులు కలుపుతుందని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 26 Aug 2023 2:45 AM GMTచంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఏ దేశమూ సాధించని ఘనత జాబిల్లి దక్షిణ ధృవంపై దిగడంతో ఇస్రో పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో చంద్రయాన్ - 4 చర్చ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన కొన్ని కీలక విషయాలు హల్ చల్ చేస్తున్నాయి
అవును... చంద్రయాన్ - 3 సక్సెస్ అవ్వడంతో జాబిల్లి దక్షిణ ధృవంపై ఉన్న నీటికి సంబంధించిన వివరాల్ని ప్రజ్ఞాన్ రోవర్ అందిస్తుంది. ఈ సమయంలో చంద్రయాన్ - 3 తర్వాత వాట్ నెక్స్ట్ అనే చర్చ మొదలైంది. దీంతో త్వరలో చంద్రయాన్ - 4 ఉండబోతుందని.. అందులో జపాన్ ఎంట్రీ ఇవ్వబోతుందనే చర్చ తెరపైకి వచ్చింది.
2026లో చంద్రయాన్-4 ఉంటుందనీ.. దీనికి జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ.. మన ఇస్రోతో చేతులు కలుపుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త ప్రాజెక్టును ల్యూనార్ పోలార్ ఎక్స్ ప్లొరేషన్ మిషన్ అని పిలుస్తారని కూడా చెబుతున్నారు. ఈ ప్రయోగం జపాన్ కు చెందిన హెచ్-3 రాకెట్ ద్వారా సాగనుందని అంటున్నారు.
ఈ క్రమంలో చందమామపై మనుషులు జీవించేందుకు అవకాశం ఉంటుందా లేదా అనేది చంద్రయాన్-4 ఆన్సర్ ఇస్తుందని అంటున్నారు. పైగా టెక్నాలజీ విషయంలో జపాన్ ని కొట్టేవాడు లేడని అంటారు. దీంతో.. ఇస్రోకు జపాన్ తోడయితే ఆ కథే వేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇది ప్రస్తుతం ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న చర్చ మాత్రమే!
కాగా... ఆగస్టు 23న చందమామపై దగిన ప్రజ్ఞాన్ రోవర్.. 14 రోజులు పనిచేస్తుందనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో అది సూర్యుడి ఎండను తన సోలార్ ప్లేట్ల ద్వారా పొందుకుని పనిచేస్తుంది. ఆ తర్వాత ఎండ ఉండక పోవడంతో దారుణంగా ఉష్ణోగ్రత పడిపోతుందని చెబుతున్నారు. ఫలితంగా రోవర్ పనిచేయకపోవచ్చని చెబుతున్నారు.