Begin typing your search above and press return to search.

లండన్ లో జున్ను దొంగలు.. ఎన్ని కోట్ల విలువో తెలుసా?

అవును... లండన్ లో కొందరు కేటుగాళ్లు భారీ ఎత్తున జున్ను ఎత్తుకెళ్లిన ఘటన తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   30 Oct 2024 11:30 AM GMT
లండన్  లో జున్ను దొంగలు.. ఎన్ని కోట్ల విలువో తెలుసా?
X

కాదేదీ కన్నానికి అనర్హం అని నిరూపించే ప్రయత్నంలో కేటుగాళ్లు ఎప్పుడూ బిజీగా ఉంటుంటారు! అదేదో సినిమాలో చూపించినట్లు అపార్ట్ మెంట్ లో గుమ్మాల ముందు ఉన్న పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు ఎత్తుకెళ్లినట్టుగా అన్నట్లు జున్ను కాజేశారు. దాని విలువ రూ. 3 కోట్లకు పైమాటే అని అంటున్నారు.

అవును... లండన్ లో కొందరు కేటుగాళ్లు భారీ ఎత్తున జున్ను ఎత్తుకెళ్లిన ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్లుగా అవతారమెత్తినా వాళ్లు.. ఏకంగా 22 టన్నుల జున్ను కాజేశారు. దీని విలువ రూ.3 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. దీంతో... ఈ విషయం అటు స్థానికంగానూ, ఇటు నెట్టింట్లోనూ వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... లండన్ లోని ప్రముఖ చెద్దర్ డెయిరీ జున్ను ఉత్పత్తులకు బాగా ఫేమస్ అయ్యింది. ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ తయారు చేసే ఇక్కడి జున్నుకు ఫుల్ డిమాండ్ ఉంటుందని చెబుతుంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ డెయిరీ నాణ్యతలో పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

బ్రిటన్ లోని ప్రముఖ చెఫ్ జామీ ఆలివర్ బాధ్యత వహిస్తున్న ఈ జున్ను ధర కూడా ఎక్కువగానే ఉంటుందని చెబుతారు. ఈ నేపథ్యంలో ఈ జున్ను చోరీకి కొందరు కలిసి పెద్ద ప్లానే వేశారట. ఇందులో భాగంగా... ఫ్రెంచ్ రిటైల్ హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్లుగా చెప్పుకొని ఈ మోసానికి పాల్పడినట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా యాజమాన్యాన్ని నమ్మిచి సుమారు 22 టన్నుల జున్ను తీసుకెళ్లారు. అయితే... అది గమ్యస్థానానికి చేరకపోవడంతో ఆరాతీసిన డెయిరీ యాజమాన్యానికి జరిగిన మోసం తెలిసిందని అంటున్నారు. దీంతో.. ఈ విషయాన్ని ఇన్ స్టాలో పంచుకున్న జామీ ఆలివర్... తన కోటికి పైగా ఉన్న తన ఫాలోవర్ల సాయం కోరారు.