పడక సుఖం ఇవ్వలేదని... అత్తను చంపేసిన అల్లుడు!
వివరాళ్లోకి వెళ్తే... చెన్నైలోని కన్నన్ వీధిలో 60ఏళ్ల ఒక వ్యక్తి తన భార్య(55) తోపాటు కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసముంటున్నాడు
By: Tupaki Desk | 1 Aug 2023 1:30 AM GMTనిత్యం పోర్న్ వీడియోలు చూసే అలవాటున్న ఒక వ్యక్తి.. తన సొంత అత్తమీద కన్నేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటూ, అందంగా ఉన్న తన అత్తతో పడక సుఖం పోందాలని భావించాడు. పైగా ఈ పనిలో తన స్నేహితుడిని కూడా భాగస్వామిని చేయాలని అనుకున్నాడు. కాకపోతే మ్యాటర్ రివర్స్ అయ్యింది!
వివరాళ్లోకి వెళ్తే... చెన్నైలోని కన్నన్ వీధిలో 60ఏళ్ల ఒక వ్యక్తి తన భార్య(55) తోపాటు కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడు స్థానికంగా ఉన్న ఒక ఐరన్ కంపెనీలో పనిచేశ్తున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లిపోయాడు!
ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో అతని కుమారుడు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అతని తల్లి తలకు బలమైన గాయమై మృతి చెంది ఉండడంతో దిగ్భ్రాంతికి గురై కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనంతరం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు పోలీసులు. ఆ సమయంలో బాధితురాలి ఇంటికి ఇద్దరు యువకులు వచ్చి వెళ్లినట్లు తేలింది. ఈ విచారణలో ఆమె ఇంటికి వెళ్లిన యువకుల్లో మృతురాలి అన్న కొడుకు కూడా ఉన్నాడని తేలింది.
దీంతో దీంతో మృతురాలి మేనల్లుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ విచారణలో తాను తన స్నేహితుడితో కలిసి తన మేనత్త ఇంటికి వెళ్లినట్లు అంగికారించాడని తెలుస్తోంది. ఇదే సమయంలో ఆరోజు ఏమి జరిగిందనే విషయాలు పోలీసులకు వివరంగా వివరించాడని తెలుస్తోంది.
ఇంటికి వెళ్లిన సమయంలో అతడి అత్త ఒంటరిగా ఉండటం గమనించిన ఆమె అల్లుడు... అవకాశంగా తీసుకుని ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడట. దీంతో... దిగ్భ్రాంతికి గురైన ఆమె అల్లుడిని తిట్టి ఇంటినుంచి వెళ్లిపోమని.. అలా కానిపక్షంలో ఇంట్లో వాళ్లకు చెబుతామని హెచ్చరించిందంట.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు... తన అత్త జుట్టు పట్టుకుని నేలపై పలుమార్లు కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుందట. అక్కడితో శాంతించని నిందితుడు... పక్కనే ఉన్న స్క్రూ డ్రైవర్ ను తీసుకుని తన అత్త మెడపై బలంగా పొడిచాడు. అనంతరం రాడ్ తీసుకుని తల మీద దాడి చెయ్యడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని చెబుతున్నారు
దీంతో మృతురాలి అల్లుడు (21), అతని స్నేహితుడిని (22) లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సమయంలో వారి సెల్ ఫోన్ లను చెక్ చేయగా... ఆ ఫోన్స్ నిండా పోర్న్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపిందని తెలుస్తోంది!