Begin typing your search above and press return to search.

ఇండియాలో మగాళ్ల శృంగారంపై మహిళా కోచ్ కామెంట్స్... వీడియో!

అవును... తాజాగా భారతీయ మహిళా కోచ్.. భారతదేశంలోని పురుషుల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   26 July 2024 3:30 PM GMT
ఇండియాలో మగాళ్ల శృంగారంపై మహిళా కోచ్  కామెంట్స్... వీడియో!
X

భారతదేశంలోని పురుషులకు శృంగారం చేయడం రాదు.. వాళ్ల దృష్టిలో శృంగారం అంటే నెలకోసారి డిన్నర్ డేట్ మాత్రమే.. పైగా వాళ్లకు తమ ముందున్న మహిళలను గౌరవించడం రాదు.. అందుకే నేను భారత పురుషులతో శృంగారం చేయను అంటూ సంచలన కామెంట్స్ చేశారు ఓ మహిళా కోచ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.


అవును... తాజాగా భారతీయ మహిళా కోచ్.. భారతదేశంలోని పురుషుల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా అది శృంగారం గురించి కావడం.. ఇదే సమయంలో వారికి శృంగారం చేయడం రాదని అనడం వంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట వైరల్ ఇష్యూ అయ్యింది.

వివరాళ్లోకి వెళ్తే... లైఫ్ కోచ్ చేతన చక్రవర్తి తాజాగా భారతీయ పురుషుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇండియాలోని పురుషుల గురించి మాట్లాడుతూ... వారితో డేటింగ్ చేయకూడదని.. దానికి గల కారణాలను కూడ వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారిపై పలు ఆరోపణలు చేశారు.

శృంగారం అంటే గొప్ప గొప్ప బహుమతులు కొనివ్వడం కాదు.. స్త్రీ ఆలోచనలను, ఆనందాన్ని అర్ధం చేసుకోవడం అన్నట్లుగా ఆమె వివరించారు! ఇదే క్రమంలో... మూడో కారణం విషయానికొస్తే... వారికి ఇంటిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. ఇంట్లో బాధ్యతలు పంచుకోవడం అంటే భాగస్వామికి ఫేవర్ చేస్తున్నట్లు కాదని.. అది తమ బాధ్యతని వారు గుర్తించరని తెలిపారు!

ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోపై విభిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. ఇందులో కొంతమంది ఈమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తుండగా.. ఇంకొంతమంది మాత్రం అందరినీ ఒకే గాటిన కట్టడం సరికాదని చెబుతున్నారు.. మరికొందరు మాత్రం ఎవరి అనుభావాలు వారివంటూ స్పందిస్తున్నారు.