విజయసాయిరెడ్డి... చెవిరెడ్డిలకు అక్కడ కీ రోల్...!
దాంతో కొంతమంది కీలక నేతలకు ముఖ్య బాధ్యతలు అప్పగించారు. వారిని ఆయన రీజియన్లకు బాధ్యులను చేస్తూ ఎప్పటికపుడు అలెర్ట్ చేస్తూ ఉంటారు అన్న మాట
By: Tupaki Desk | 31 Jan 2024 3:45 PM GMTవైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యేల సీట్లతో పాటు ఎంపీ సీట్లను కూడా ఈసారి పెద్ద ఎత్తున గెలుచుకోవాలని చూస్తోంది. దాంతో కొంతమంది కీలక నేతలకు ముఖ్య బాధ్యతలు అప్పగించారు. వారిని ఆయన రీజియన్లకు బాధ్యులను చేస్తూ ఎప్పటికపుడు అలెర్ట్ చేస్తూ ఉంటారు అన్న మాట
తాజాగా వైసీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు చూస్తే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డికి గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటిదాకా ఒంగోలు బాధ్యతలను చూసిన విజయసాయిరెడ్డిని ఇపుడు గుంటూరు ఎంపీ పరిధి బాధ్యతలు అప్పగిస్తూ ఆ వైపునకు నడిపించారు.
గుంటూరు పార్లమెంట్ సీటు వైసీపీకి ఎపుడూ టఫ్ గానే ఉంటోంది. 2014, 2024 ఎన్నికల్లో ఈ సీటు నుంచి ఎంపీగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధులు ఓటమి పాలు అయ్యారు. దాంతో 2024లో గెలవాలని ఆ పార్టీ చూస్తోంది. ఈ మేరకు విజయసాయిరెడ్డికి అత్యంత ముఖ్య బాధ్యతలనే అప్పగించారు అనుకోవాలి. ఆయన మొత్తం కో ఆర్డినేట్ చేసుకుంటూ అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ పరిధిలో వైసీపీ జెండా ఎగిరేలా చూడాల్సి ఉంది అని అంటున్నారు.
అదే విధంగా మరో ముఖ్య నేత చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఒంగోలు పార్లమెంట్ పరిధితో పాటు, కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ వ్యవహారాలను చూసేలా రీజనల్ కో ఆర్డినేటర్ పదవిని కట్టబెట్టారు అని అంటున్నారు.
ఈ మేరకు ఈ తాజా నియామకాలను ప్రకటిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి గుంటూరు తో పాటు ఒంగోలు తదితర ఎంపీ సీట్లు ఇతర నియోజకవర్గాలలో కూడా పోటీ ఉందని అంటున్నారు. దాంతోనే మరింత క్లోజ్ మోనిటరింగ్ చేస్తూ ఫుల్ అలెర్ట్ గా ఉండేలా ఈ డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు. రానున్న రోజులలో మరింత మంది సీనియర్లకు ఎన్నికల్లో పోటీ చేయని నేతలకు వివిధ కీలక నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.