Begin typing your search above and press return to search.

కేసీయార్ గాలి తీసేసిన చిదంబరం

కేసీయార్ ఎన్నికల ప్రచారంలో ఒక్కటే మాట అంటున్నారు. ఈసారి బీయారెస్ గెలిస్తే కేంద్రంలో శాసిస్తామని, చక్రం తిప్పుతామని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 3:38 AM GMT
కేసీయార్ గాలి తీసేసిన చిదంబరం
X

కేసీయార్ ఎన్నికల ప్రచారంలో ఒక్కటే మాట అంటున్నారు. ఈసారి బీయారెస్ గెలిస్తే కేంద్రంలో శాసిస్తామని, చక్రం తిప్పుతామని అంటున్నారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో బీయారెస్ కీలకమైన పాత్ర పోషిస్తుంది అని కూడా అంటున్నారు.

దేశంలో ప్రాంతీయ పార్టీల సంకీర్ణం ఏర్పడుతుందని కూడా జోస్యం చెప్పారు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకున్నారు కేంద్ర మాజీ హోం మంత్రి, తమిళనాడుకు చెందిన దిగ్గజ కాంగ్రెస్ నేత పి చిదంబరం. ఆయన కేసీయార్ మాటల మీద ఫైర్ అవుతూనే గాలి తీసేశారు.

కేంద్రంలో చక్రం తిప్పుతామని కీలకం అవుతామని కేసీయార్ చెబుతున్నారని అసలు కేసీయార్ కి ఎన్ని సీట్లు వస్తాయని ఆయన నిలదీశారు. నిజానికి చూస్తే తెలంగాణాలో ఉన్న సీట్లే 17 ఎంపీలు. ఇందులో కేసీయార్ బీయారెస్ కి మొత్తానికి మొత్తం రానే రావు.

ఆయనకు 2018లోనే 8 సీట్లు వచ్చాయి. ఇపుడు కూడా దానికి అటో ఇటో వస్తాయి. మరి ఈ తక్కువ నంబర్ సింగిల్ డిజిట్ నంబర్ తో కేసీయార్ కేంద్రంలో ఏమి చక్రం తిప్పుతారు అన్నదే చిదంబరం లా పాయింట్. అలా కేసీయార్ చెబుతున్న మాటలు అన్నీ ఊకదంపుడు అని నమ్మవద్దని ఆయన తెలంగాణా ప్రజలను కోరుతున్నారు అన్న మాట.

ఇక హైదరాబాద్ స్టేట్ ని ఆనాటి ఆంధ్ర రాష్ట్రంతో కేంద్రంలోని కాంగ్రెస్ కలిపేసింది ఆది నుంచి కాంగ్రెస్ తెలంగాణాకు తీరని అన్యాయం చేస్తోందని, నిజమైన విలన్ అని కేసీయార్ అనేక సభలలో చెబుతున్నారు. దీని మీద కూడా చిదంబరం మండిపడ్డారు.

కేసీయార్ కి చరిత్ర తెలుసునా అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అయింది భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన అని ఆయన గుర్తు చేశారు. అలా దేశంలో చాలా చోట్ల రాష్ట్రాలు ఆవిర్భవించాయని చిదంబరం చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణా అన్నది ఏర్పాటు సమయంలో కేసీయార్ ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోవాలని ఆయన కోరారు.

తెలంగాణా ఏర్పాటు తరువాత కేసీయార్ తాను ఇచ్చిన మాటలు అన్నీ పక్కన పెట్టారని అప్పుల కుప్పగా తెలంగాణాను మార్చారని ఆయన అన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కేసీయార్ ని దించేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని ఆయన అంటున్నారు.

మొత్తానికి ఒకనాడు తెలంగాణాను ఇచ్చి ఉమ్మడి ఏపీని విడగొట్టిన ఘనతను నాటి హోం మంత్రిగా చిదంబరం మూటగట్టుకున్నారు. ఇపుడు అదే చిదంబరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఉమ్మడి ఏపీ ఏర్పడింది అని చెప్పడం విశేషం. మరి అలా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ని ఎందుకు విడగొట్టారో చిదంబరం అయినా చెప్పగలరా దానికి ఆయన లాజిక్ పాయింట్ ఏంటో కూడా చెప్పగలరా అన్నది ఇపుడు అందరూ అడుగుతున్న ప్రశ్న.