Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను రాఖీ సావంత్ తో పోలుస్తూ రేవంత్ మాస్ టీజింగ్

దీనికి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ‘టిక్ టాక్ సర్వేలో సీఎం రేవంత్ కంటే తనకే ఎక్కువ లైకులు వచ్చాయంటూ కేసీఆర్ కార్యకర్తలతోచెప్పుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 5:39 AM GMT
కేసీఆర్ ను రాఖీ సావంత్ తో పోలుస్తూ రేవంత్ మాస్ టీజింగ్
X

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. తనను ఉద్దేశించి గులాబీ బాస్ కేసీఆర్ మాటలు అనాలని.. అందుకు ప్రతిగా దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇవ్వాలని తపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక కొంత తీరినట్లుగా చెప్పాలి. తనను ఉద్దేశించి కేసీఆర్ మాటలు అన్న గంటల వ్యవధిలోనే రేవంత్ రియాక్టు కావటమే కాదు.. ‘పుసుక్కున అంత మాట అనేశావేంటి?’ అంటూ సినిమా డైలాగు తరహాలో మాటలు అనేశారు.

తాను కొడితే గట్టిగా కొడతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అంతే ధీటుగా రియాక్టు అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తనను.. తన పాలనను ఉద్దేశించి విమర్శలు చేసినంతనే.. అందుకు పది రెట్లు విమర్శలతో ఉతికేయాలన్న తపన పద్నాలుగు నెలలకు.. తాజాగా వచ్చిన అవకాశంతో రేవంత్ కు కొంత తీరిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా.. గులాబీ బాస్ కు అనుకూలంగా ప్రజాభిప్రాయం వెల్లడైందంటూ తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

దీనికి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ‘టిక్ టాక్ సర్వేలో సీఎం రేవంత్ కంటే తనకే ఎక్కువ లైకులు వచ్చాయంటూ కేసీఆర్ కార్యకర్తలతోచెప్పుకుంటున్నారు. గతంలో టిక్ టాక్ సర్వేలో సల్మాన్ ఖాన్ కంటే కూడా రాఖీ సావంత్ కు ఎక్కువ లైకులు వచ్చాయి. రాఖీ సావంత్ మరి సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువంటే సరిపోద్దా?’ అంటూ తనదైన పంచ్ లను విసిరారు. మొత్తంగా తనను తాను సల్మాన్ ఖాన్ గా అభివర్ణించుకున్న సీఎం రేవంత్.. పనిలో పనిగా కేసీఆర్ ను ఉద్దేశించి రాఖీ సావంత్ గా అభివర్ణించటం గులాబీ బాస్ కు ఒళ్లు మండేలా చేస్తుందని చెప్పాలి. నిజానికి రేవంత్ రెడ్డికి కూడా కావాల్సింది అదే కదా? కాదంటారా?