Begin typing your search above and press return to search.

'ఇందిరమ్మ' పేరు టచ్ చేసి కేసీఆర్ పెద్ద తప్పు చేశారా?

ఇందిరమ్మను అదే పనిగా ఆడిపోసుకుంటున్న కేసీఆర్.. 2004లో ఇదే కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు? అని ప్రశ్నిస్తున్నారు

By:  Tupaki Desk   |   21 Nov 2023 12:30 PM GMT
ఇందిరమ్మ పేరు టచ్ చేసి కేసీఆర్ పెద్ద తప్పు చేశారా?
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ గులాబీ బాస్ కేసీఆర్ కు ఏమైంది? మాటల మాంత్రికుడిగా ఆయనకున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గురి చూసి కొట్టినట్లుగా ఉండే కేసీఆర్ మాటలు.. వ్యూహం వేశారంటే తిరుగులేని విధంగా ఉండే ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆయన.. సమయం.. సందర్భం లేకుండా తీసుకొచ్చిన ఒక ప్రస్తావన గులాబీ తోటలో కొత్త అలజడిని తీసుకురావటమే కాదు.. ప్రత్యర్థులకు పదునైన ఆయుధాన్ని ఇచ్చినట్లుగా మారిందన్న మాట వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న కేసీఆర్.. తాజాగా ఇందిరమ్మను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చేలా మారాయంటున్నారు. సమయం.. సందర్భం లేకుండా ఇందిరమ్మను ఉద్దేశించి చేస్తున్న విమర్శలు ఏమాత్రం బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అంటున్న కేసీఆర్ మాటలకు కాంగ్రెస్ పార్టీ ఘాటుగా రియాక్టు అయ్యింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ఇందిరమ్మ ప్రస్తావన వారికి ఒక ఆయుధంగా మారిందన్నవిషయాన్ని తెలియజేసేలా మారిందంటున్నారు. రేవంత్ చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే.. 'ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యమని కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దళితులకు.. గిరిజనులకు భూములు పంచి ఇచ్చిన రాజ్యం. ఇందిరమ్మరాజ్యం 12 లక్షల పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం నాగార్జున సాగర్.. శ్రీశైలం కట్టింది. ఇందిరమ్మ రాజ్యం ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ను డెవలప్ చేసింది.ఇందిరమ్మ రాజ్యం రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందిరమ్మరాజ్యంలో సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర నువు బిచ్చం ఎత్తుకుని బతికేటోడివి'' అంటూ గుక్క తిప్పుకోకుండా చేస్తున్న విమర్శల్ని చూస్తే.. ఇందిరమ్మ ప్రస్తావన తీసుకురావటం ద్వారా కేసీఆర్ తప్పు చేశారన్న భావన కలుగక మానదు.

ఇందిరమ్మను అదే పనిగా ఆడిపోసుకుంటున్న కేసీఆర్.. 2004లో ఇదే కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు? అని ప్రశ్నిస్తున్నారు. మరి అంత దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీతో మిత్రుడిగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేసినట్లు? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఇందిరమ్మ ప్రస్తావన తీసుకురావటం ద్వారా కేసీఆర్ తప్పు చేశారని.. ప్రత్యర్థి మీద ఒత్తిడిని పెంచాల్సిన కేసీఆర్.. చివరకు తమ పార్టీనే ఒత్తిడికి లోనయ్యేలా మాటలు ఉన్నట్లుగా చెబుతున్నారు.