మూడు రోజుల్లో తేలిపోతుంది.. కేసీఆర్‌కు బిగ్ అప్‌డేట్!!
దీంతో క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ఒకవైపు ప్రచారం చేసుకుంటూనే మరోవైపు.. అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు
By: Tupaki Desk | 26 Nov 2023 11:30 AM GMT''ఇదిగో ఆయనింకా.. జంకుతున్నడా! మన దారిలోకి రాలేదా? ముందు మాట్లాడవయ్యా! మాట్లాడు'' ఇదీ.. అసంతృప్త నేతలను బుజ్జగించే వ్యూహంలో భాగంగా దిగువస్థాయి నాయకులకు బీఆర్ ఎస్ అధి నేత సీఎం కేసీఆర్ చెబుతున్న మాట. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికీ ఆయన ఫోన్లు చేస్తున్నారు. పదే పదే చేస్తున్నారు. ఎక్కడ గెలుపు గుర్రం ఎక్కడంపై కష్టంగా ఉందో.. అక్క డసరిదిద్దే ప్రయత్నం చేస్తున్నా రు.
దీంతో క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ఒకవైపు ప్రచారం చేసుకుంటూనే మరోవైపు.. అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత.. అనేక మందిని పార్టీ బుజ్జగించింది. ప్రతి నియోజకవర్గాన్నీ జల్లెడ పట్టి మరీ.. అభ్యర్థులకు అనుకూలంగా ఉండాలని.. ప్రభుత్వం వస్తే.. మళ్లీ ప్రాధాన్యం ఇస్తామని.. చెప్పారు. స్వయంగా సీఎం కేసీఆర్ అనేక సభల్లో ఈ మాటను బహిరంగంగానే చెబుతున్నారు.
అయితే.. ఆయన ముందు ఓకే అన్న అసంతృప్తులు.. ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అభ్యర్థులకు దూరంగా ఉంటున్నారు. ఫోన్లు చేసినా.. కలవడం లేనంతగా వ్యవహరిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో 40 నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రత్యక్షంగా అసంతృప్తుల సెగ తగలకపోయినా.. అంతర్గతంగా వారు కాంగ్రెస్ అభ్యర్థులతో మిలాఖత్ అయ్యారనే వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనే అంచనాలు వేసుకుంటున్న అసంతృప్తులు అటు వైపు అభ్యర్థులతో చేతులు కలిపారనేది కేసీఆర్‌కు వచ్చిన సమాచారం. కనీసం 20 వేల నుంచి 30 వేల ఓట్లను చీల్చి తమకు దెబ్బకొట్టే స్థాయిలో ఉన్న అసంతృప్తులకు ఏం చేసైనా సరే దారికి తెచ్చుకోవాలనే రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.
అందుకే నిరంతరం.. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు ఫోన్లు చేస్తన్నారు. కొందరికి ఏకంగా.. కోటి రూపాయల చొప్పున సొమ్ము ముట్టజెప్పేందుకు అంగీకరించినట్టు తెలంగాణలో చర్చ సాగుతోంది. మరికొందరు మాత్రం ఇంకా బింకంగానే ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరో మూడు రోజుల్లో ఈ విషయాన్ని తేల్చాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట.