పిక్నిక్ లో స్టూడెంట్ తో టీచరమ్మ డ్యాన్సులు, కిస్సులు.. హైకోర్టులో ఫోక్సో కేసు!
విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరమ్మ విద్యార్ధితో కలిసి డ్యాన్స్ చేసింది.. పద్దతులు నేర్పాల్సిన టీచరమ్మ ఫోటో షూట్ పేరుతో హద్దులు దాటింది
By: Tupaki Desk | 31 July 2024 9:41 AM GMTవిద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరమ్మ విద్యార్ధితో కలిసి డ్యాన్స్ చేసింది.. పద్దతులు నేర్పాల్సిన టీచరమ్మ ఫోటో షూట్ పేరుతో హద్దులు దాటింది.. దీంతో పద్దతి లేకుండా ప్రవర్తించారంటూ ఆమెపై ఫోక్సో కేసు నమోదైంది! ఈ సమయంలో ఆ టీచరమ్మ నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది. దీంతో... టీచరమ్మ వ్యవహారం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.
నేరుగా వివరాళ్లోకి వెళ్తే... గత ఏడాది కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళ్లాపూర్ జిల్లా మురుగమల్ల ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులను సమీపంలోని అటవీ ప్రాంతానికి విజ్ఞాన యాత్ర కోసం తీసుకెళ్లారు. అయితే... ఈ విజ్ఞాయ యాత్ర కాస్తా మరో టర్న్ తీసుకున్నట్లుగా మారిన పరిస్థితి! ఇందులో భాగంగా.. ఓ పదోతరగతి విద్యార్థితో హెడ్మాస్టరమ్మ శృతిమించారు.. అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి!
ఇలా పిల్లలను ఎక్స్ కర్షన్ అని తీసుకెళ్లి... వారితో కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ కు డ్యాన్సులు చేయడం.. ఫోటో షూట్ పేరు చెప్పి అసభ్యంగా ప్రవర్తించడం చేశారట! ఇందులో భాగంగా... టీచర్ ను ఆ విద్యార్థి ప్రియురాలి తరహాలో పైకి ఎత్తుకోగా, అనంతరం వారిరువురూ ప్రీ వెడ్డింగ్ షూట్ స్టైల్లో ఫోటోలకు ఫోజులివ్వడం.. ఇదే సమయంలో అతడు ఓ గులాబీ పువ్వు అందించి ముద్దు పెట్టడం.. ఆమె కూడా అదే స్టైల్లో రిటన్ గిఫ్ట్ ఇవ్వడం చేశారని అంటున్నారు!
ఈ నేపథ్యంలో... ఈ వ్యవహారానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారాయి. దీంతో... సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఇవేమి పనులంటూ కామెంట్లు తెరపైకి వచ్చాయి. విద్యార్థితో హద్దులు దాటిన ఆమెపై చర్యలు తీసుకోవాలని పలువురు మండిపడిన పరిస్థితి. ఇక విద్యార్ధుల తల్లితండ్రులైతే ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో... ఆమెపై ఫోక్సో కేసు నమోదైంది. అయితే... ఈ కేసును రద్దు చేయడానికి చిక్బళ్లాపుర్ జిల్లా న్యాయస్థానం నిరాకరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థితో డ్యాన్సు చేసిన ఫోటోను అడ్డుపెట్టుకుని ఫోక్సో కేసు నమోదు చేయడం సరికాదంటూ తన వాదనలు వినిపించారు. అయితే... ఈ కేసు కొట్టివేయడం కుదరదని ప్రకటించిన హైకోర్టు... తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది.